Google Maps – Gemini AI: గూగుల్ మ్యాప్స్ (Google Maps) నావిగేషన్, లొకేషన్ ఆధారిత సేవలను మరింత మెరుగుపరచేందుకు గూగుల్ ఏఐ అసిస్టెంట్ జెమిని (Gemini)తో జత కట్టింది. ఈ కొత్త అప్డేట్ ద్వారా వినియోగదారులు డ్రైవింగ్‌పై దృష్టి పెట్టినట్టుగానే హ్యాండ్స్-ఫ్రీగా మ్యాప్స్‌తో మాట్లాడగలరు. అంతేకాకుండా.. గూగుల్ మ్యాప్స్ ద్వారా ఇప్పుడు డ్రైవర్లు వాయిస్ కమాండ్లతోనే నావిగేషన్, సెర్చ్, ETA పంచుకోవడం, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ లభ్యత సెర్చ్ చేయడం, క్యాలెండర్ ఈవెంట్లు జోడించడం వంటి […]
Tata Sierra SUV: టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ నుంచి త్వరలో విడుదల కానున్న సియెరా (Sierra) ఎస్యూవీ గురించి ఆసక్తిని పెంచుతూ వరుస టీజర్లను విడుదల చేస్తోంది. నవంబర్ 25న లాంచ్‌కు ముందే కంపెనీ ఇప్పటికే ఈ కారు ఔటర్ లుక్, సన్‌రూఫ్, కాస్త ఇంటీరియర్ వివరాలను వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన టీజర్ వీడియోలో టాటా సియెరా డాష్‌బోర్డ్‌పై ఉన్న మూడు స్క్రీన్ లేఅవుట్ (Triple-Screen Layout)ను హైలైట్ చేసింది. ఇది ప్రస్తుతం టాటా […]
Maruti Suzuki India: భారత ఆటోమొబైల్ రంగంలో మరో చారిత్రాత్మక ఘనతను సాధించింది మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (Maruti Suzuki India Limited). దేశీయ మార్కెట్లో మొత్తం 3 కోట్ల యూనిట్ల విక్రయాలను నమోదు చేసి ఈ మైలురాయిని చేరుకున్న మొట్టమొదటి ప్యాసింజర్ వాహన తయారీ సంస్థగా మారింది. 1983 డిసెంబర్ 14న మొదటి కారు మారుతి 800ను వినియోగదారులకు అందించిన 42 ఏళ్లలో కంపెనీ ఈ విజయాన్ని సాధించింది. టీమిండియా అమ్మాయిలకు TATA బహుమతి.. […]
Tata Sierra: భారత మహిళల క్రికెట్ జట్టు సాధించిన చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఓ మంచి కార్యాన్ని తలపెట్టింది. ప్రపంచ కప్ గెలిచిన జట్టులోని ప్రతి సభ్యురాలికి త్వరలో విడుదల కానున్న సరికొత్త టాటా సియెరా (Tata Sierra) ఎస్‌యూవీని బహుమతిగా ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇది కేవలం బహుమతి మాత్రమే కాదు.. వారి అద్భుతమైన ధైర్యసాహసాలు, అంకితభావం, దేశానికి గర్వకారణం తెచ్చిన స్ఫూర్తికి నిజమైన గౌరవమని టాటా మోటార్స్ పేర్కొంది. […]
Moto g57: మోటోరోలా (Motorola) తమ “G సిరీస్”లో కొత్తగా రెండు మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. మోటో జీ57 (Moto g57), మోటో జీ57 పవర్ (Moto g57 Power) స్మార్ట్ ఫోన్స్ ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది మోటోరోలా. ఈ రెండు ఫోన్లు Snapdragon 6s Gen 4 మొబైల్ ప్లాట్ ఫామ్ ప్రాసెసర్‌తో పనిచేస్తున్న మొట్టమొదటి ఫోన్లు కావడం వీటి ప్రత్యేకత. ఇవి రెండూ ఆక్టా-కోర్ Snapdragon 6s […]
Ind vs Aus 4th T20: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. ఇప్పటివరకు ఇరు జట్లు చెరో ఒక్క మ్యాచ్ గెలవడంతో సిరీస్‌లో ఆధిక్యం సాధించడానికి నాల్గవ టీ20 మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్ నేడు (నవంబర్ 6) భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కు వేదికగా ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ నగరంలోని బిల్ పిప్పెన్ ఓవల్ మైదానం ఆతిధ్యం […]
RCB For Sale: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీని విక్రయానికి ఉంచారు. ఐపీఎల్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) రెండింటిలోనూ పాల్గొంటున్న ఈ జట్టును ప్రస్తుతం కలిగి ఉన్న డియాజియో (Diageo) సంస్థ విక్రయ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. ఈ విక్రయాన్ని మార్చి 31, 2026 నాటికి పూర్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. 2008 నుంచి ఐపీఎల్లో భాగమైన RCB జట్టు 2025లో మొదటిసారిగా పురుషుల […]
Namo Jersey: మహిళల ప్రపంచ కప్ 2025 గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నాడు న్యూఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులతో ఆయన ముచ్చటించారు. ప్రపంచ కప్ విజయం సాధించినందుకు ప్రధాని మోదీ జట్టును అభినందించారు. ముఖ్యంగా మూడు వరుస ఓటముల తర్వాత టోర్నమెంట్లో జట్టు అద్భుతమైన కం బ్యాక్ ఇవ్వడం, అలాగే సోషల్ మీడియాలో ఎదుర్కొన్న […]
Kidney Stones: మూత్రపిండాల్లో రాళ్లు (Kidney Stones) ఏర్పడటం అనేది ప్రస్తుత కాలంలో చాలా సాధారణమైన సమస్యగా మారింది. కిడ్నీలలో ఖనిజాలు (మినరల్స్) ఒకదానికొకటి అతుక్కుని చిన్న లేదా పెద్ద సైజులో ఒక్క గట్టి పదార్థంగా మారడమే కిడ్నీ స్టోన్స్. ఇవి మొదట్లో చిన్నవిగా ఉండి పెద్దవిగా మారి మూత్రనాళంలో కదలినప్పుడు తీవ్రమైన నొప్పి, మంట, మూత్ర విసర్జనలో అడ్డంకి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యకు సకాలంలో చికిత్స చేయించుకోకపోతే ఇవి కిడ్నీలకు హాని కలిగించడంతో […]
POCSO Case: కేరళలోని మంజేరిలోని ప్రత్యేక లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ (POCSO) కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మైనర్ బాలికపై పదేపదే లైంగిక దాడికి పాల్పడినందుకు ఒక జంటకు చెరో 180 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2019 నుంచి 2021 మధ్యకాలంలో నిందితులైన మహిళ, ఆమె భర్త కలిసి దారుణానికి పాల్పడ్డారు. మొదటగా బాధితురాలి తల్లి తన భర్తను విడిచిపెట్టిన తర్వాత ఈ దారుణమైన కేసు వెలుగులోకి వచ్చింది. తిరువనంతపురంలో ఉన్నప్పుడు నిందితురాలు […]