Female Hostages Released: హమాస్ బందీలుగా ఉన్న నలుగురు ఇజ్రాయెల్ మహిళా సైనికులు విడుదల
- ఇజ్రాయెల్‌తో హమాస్ కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందం
- హమాస్ బందీలుగా ఉన్న నలుగురు ఇజ్రాయెల్ మహిళా సైనికులు విడుదల
- నిత్యం శారీరక మానసికంగా వేధింపులకు గురయ్యామన్న మహిళా సైనికులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Female Hostages Released: గాజా స్ట్రిప్‌లో యుద్ధాన్ని ఆపేందుకు ఇజ్రాయెల్‌తో హమాస్ కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, శనివారం నలుగురు ఇజ్రాయెల్ మహిళా సైనికులు విడుదల అయ్యారు. కరీనా అరివ్, డానియెలా గిల్బోవా, నామా లెవీ, లిరి అల్బాగ్ మహిళా సైనికులు విడుదల చేసారు. వీరిని మొదట గాజాలోని రెడ్ క్రాస్ కు అప్పగించారు. ఈ విడుదల కార్యక్రమం సందర్భంగా, మహిళా సైనికులను ప్రత్యేక వాహనాలలో వేదికపైకి తీసుకువచ్చారు. అక్కడ వారి కుటుంబ సభ్యులతో క్షేమంగా కలుసుకున్నారు. ఈ మహిళా సైనికులు అక్టోబర్ 7 న హమాస్ దాడి సమయంలో ఇజ్రాయెల్ సైనిక స్థావరం నహాల్ ఓజ్ నుంచి అపహరించబడ్డారు. 477 రోజుల కాలంలో వారు గాజా నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లోకి తీసుకెళ్లబడ్డారని, సూర్యరశ్మి కూడా లేని చోట తమని ఉంచారని తెలిపారు.
Also Read: Republic Day Celebrations: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా 76వ గణతంత్ర వేడుకలు..
Also Read
- High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
- Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
విడుదలైన ఇజ్రాయెల్ మహిళా సైనికులు, వారి బందీ జీవితాన్ని వివరించారు. తమకు సరైన ఆహారం, నీరు లేకపోవడంతో మరుగుదొడ్లను శుభ్రం చేయడం, ఉగ్రవాదులకు ఆహారం తయారు చేయడం వంటి కష్టాలు ఎదురయ్యాయని చెప్పారు. పలుమార్లు ఏడవడానికి కూడా అవకాశం ఇవ్వలేదని తెలిపారు. గాయపడిన తమని చిత్రహింసలకు గురి చేసారని కూడా వారు తెలిపారు. ఇక, హమాస్ వారు బందీలుగా ఉన్న సమయంలో ఎక్కువ కాలం చీకటిలో గడిపినట్లు చెప్పారు.
Also Read: Vizag Fake IAS: నకిలీ ఐఏఎస్ కేసులో కొత్త ట్విస్ట్!
వారిలో కొంతమంది సైనికులకు బందీగా ఉండేటప్పుడు నిత్యం శారీరక మానసికంగా వేధింపులకు గురయ్యారని, అయితే ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని ఈ కష్టాలను ఎదుర్కొని పటిష్టంగా నిలబడినట్లు చెప్పారు. ఈ అనుభవం వారికి జీవితాంతం మరచిపోలేని జ్ఞాపకమని తెలిపారు. చాలాసార్లు వారిలో కొందరు ఉగ్రవాదులకు ఆహారం వండాల్సి వచ్చింది. దీంతో పాటు మరుగుదొడ్లను శుభ్రం చేయాలన్నారు. ఇంత చేసిన తర్వాత ఆహారం కోసం అడిగితే నిరాకరించారని, ఇప్పటి వరకు తమ జీవితంలో ఇదే అత్యంత భయంకరమైన సమయం అని సైనికులు తెలిపారు. మేము ఒకరికొకరు ధైర్యం చేసామని, అందుకే మేము ఈ రోజు వరకు జీవించామని చెప్పుకొచ్చారు.
They’re in our hands now and we are not letting go💛
Welcome home, Daniella, Liri, Karina and Naama. pic.twitter.com/A1V9FcbQY6
— Israel Defense Forces (@IDF) January 25, 2025
తాజావార్తలు
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!