Maha Kumbh Mela 2025: మహాకుంభమేళా నేపథ్యంలో విమాన ఛార్జీల నియంత్రణపై డీజీసీఏ చర్యలు
- మహా కుంభం నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌కు విమాన ప్రయాణానికి భారీగా డిమాండ్.
- ధరల నియంత్రణకై రంగంలోకి దిగిన DGCA
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maha Kumbh Mela 2025: మహా కుంభం నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌కు విమాన ప్రయాణాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీనితో టిక్కెట్ ధరలు గణనీయంగా పెరగడంతో, విమానయాన సంస్థలకు విమాన ఛార్జీలను హేతుబద్ధం చేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సూచించింది. ప్రయాగ్‌రాజ్ (Prayagraj)కు ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. స్పైస్‌జెట్ (Spicejet) వంటి విమానయాన సంస్థలు ప్రయాగ్‌రాజ్‌కు మరిన్ని విమానాలను నడుపుతున్నాయి. జనవరి నెలలో ప్రయాగ్‌రాజ్‌కి విమాన కనెక్టివిటీని మెరుగుపరచడానికి డీజీసీఏ 81 అదనపు విమానాలను ఆమోదించింది. దీంతో మొత్తం 132 విమానాలు దేశవ్యాప్తంగా ప్రయాగ్‌రాజ్‌ను కనెక్ట్ చేస్తున్నాయి.
Also Read: Google Doodle: గణతంత్ర దినోత్సవ సందర్బంగా ‘వైల్డ్‌లైఫ్ మీట్స్ కల్చర్’ డూడుల్‌తో అదరగొట్టిన గూగుల్
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో టిక్కెట్ ధరలను (ticket prices) నియంత్రించేందుకు జనవరి 23న డీజీసీఏ అధికారులు విమానయాన సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రెగ్యులేటర్, సామర్థ్యాన్ని పెంచడంలో భాగంగా, మరిన్ని విమానాలను జోడించడం, టిక్కెట్ ధరలను తగ్గించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించింది. నివేదిక ప్రకారం, ఇటీవల ఢిల్లీ-ప్రయాగ్‌రాజ్ విమాన టిక్కెట్ ధరలు 21 శాతం వరకు పెరిగాయి. మహా కుంభం ప్రారంభమైన జనవరి 13నుంచి, ఫిబ్రవరి 26 వరకు జరిగే ఈ వేడుకలో భారీ సంఖ్యలో భక్తులు, పర్యాటకులు పాల్గొంటుండడంతో ప్రయాగ్‌రాజ్‌కు విమాన బుకింగ్స్ అనేక రెట్లు పెరిగాయి. ఈ చర్యల ద్వారా విమాన ప్రయాణ సౌలభ్యాన్ని పెంచడమే కాకుండా, ప్రయాణికులపై పడే ఆర్థిక భారం తగ్గించడంలో సహాయపడాలని డీజీసీఏ ఆశిస్తోంది.
Also Read: Chennai Airport: బాంబు పేల్చేస్తామంటూ బెదిరింపులు.. చెన్నై ఎయిర్‌పోర్టులో హై టెన్షన్!
ప్రతీ 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళా పర్వం హిందువుల సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది. గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమంలో జరిగే ఈ ఘట్టానికి దేశంలో మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ వేడుక కోసం ప్రయాగ్‌రాజ్ నగరంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మహా కుంభం దృష్ట్యా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు డీజీసీఏ తీసుకుంటున్న చర్యలు ఎంతో ప్రయోజనకరంగా నిలుస్తాయని భావిస్తున్నారు.
To meet increased demand for air travel to Prayag Raj during Mahakumbh, DGCA has approved 81 additional flights in January, raising Prayagraj connectivity to 132 flights from across India.
— DGCA (@DGCAIndia) January 25, 2025
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!