Terror Attack: దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉగ్రదాడులు నిర్వహించడానికి కుట్రపన్నుతున్న ముగ్గురు వ్యక్తులను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్టు చేసింది. ఈ ముఠా దేశంలో దాడులు చేసేందుకు ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. వీరిని గుజరాత్ రాష్ట్రంలోని ఒక టోల్ ప్లాజా సమీపంలో ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ ఏటీఎస్ పట్టుకున్న ఈ ముగ్గురిలో హైదరాబాద్ నగరానికి చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ (Syed Ahmed Mohiuddin) ఉండటం తీవ్ర […]
CM Chandrababu: గుంటూరు జిల్లాలోని పెదకాకానిలో శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో నడుస్తున్న శంకర కంటి ఆస్పత్రి నూతన భవనాన్ని, అందులోని సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్పత్రి ప్రాంగణాన్ని పూర్తిగా సందర్శించి, ఆస్పత్రిలోని అన్ని విభాగాల గురించి, నూతనంగా ప్రారంభించిన సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రం యొక్క ప్రత్యేకతల గురించి […]
Camphor Aarti into Hundi: కాకినాడ జిల్లా పిఠాపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం ఆలయంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. ఆలయానికి వచ్చిన ఒక భక్తురాలు చేసిన నిర్వాకంతో అక్కడ ఉన్న హుండీకి స్వల్ప ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆలయంలో వెలుగుతున్న కర్పూరం హారతిని తీసుకున్న భక్తురాలు దానిని వెళ్లి నేరుగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి హుండీలో వేసింది. దీనితో హుండీలో ఉన్న నోట్లకు వెంటనే నిప్పు […]
OPPO Find X9, Find X9 Pro: గ్లోబల్ లాంచ్ తర్వాత ఒప్పో (OPPO) సంస్థ కొత్త స్మార్ట్ఫోన్లు Find X9, Find X9 Pro భారతదేశంలో నవంబర్ 18న విడుదల కానున్నట్లు అధికారికంగా వెల్లడించింది. దీనికి సంబంధించిన టీజర్లను ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. భారత మార్కెట్లో Find X9 టైటానియం గ్రే (Titanium Grey), స్పేస్ బ్లాక్ (Space Black) అనే రెండు రంగులలో లభించనుంది. ఇక Find X9 Pro […]
Realme GT 8 Pro: రియల్మీ (Realme) సంస్థ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ రియల్మీ GT 8 ప్రో (Realme GT 8 Pro)ను భారతదేశంలో నవంబర్ 20న లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ మొబైల్ ప్రధానంగా తన ప్రత్యేకమైన కెమెరా సిస్టమ్ ద్వారా స్మార్ట్ఫోన్ ఆవిష్కరణలలో ఒక కీలక అడుగుగా నిలువనుంది. రియల్మీ GT 8 ప్రో స్మార్ట్ ఫోన్ ను రియల్మీ, RICOH IMAGING భాగస్వామ్యంతో రూపొందించబడిన RICOH GR-పవర్డ్ కెమెరా టెక్నాలజీతో మార్కెట్లోకి రానుంది. […]
Kurnool Bus Incident: తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాలో 19 మంది మృతికి కారణమైన ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి వి.కావేరీ ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో బస్సు డ్రైవర్ మిర్యాల లక్ష్మయ్యను A1 నిందితుడిగా ఇప్పటికే అరెస్టు చేయగా, ట్రావెల్స్ యజమాని వినోద్ కుమార్ను A2 నిందితుడిగా పోలీసులు […]
Ganja Gang Attack: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం ప్రాంతంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నాయి. వనస్థలిపురం పరిధిలోని జెమ్ కిడ్నీ హాస్పిటల్ ముందు చోటుచేసుకున్న ఒక దారుణ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గురువారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఆరుగురు యువకులు హాస్పిటల్ ముందు మద్యం తాగుతూ న్యూసెన్స్ సృష్టించారు. హాస్పిటల్ ముందు మద్యం సేవించవద్దని హాస్పిటల్ సిబ్బంది అభ్యర్థించడంతో, ఆ యువకులు వారిపై దాడికి పాల్పడ్డారు. […]
Bindi Benefits: మన భారతీయ సనాతన సంప్రదాయంలో నుదుటి బొట్టు లేదా తిలకధారణ కేవలం అలంకారం మాత్రమే కాదు.. అది సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక ప్రాముఖ్యత కలిగిన ఆచారం. మన అమ్మమ్మలు, అమ్మలు నుదుటిన ధరించే కుంకుమ బొట్టు వెనుక ఎన్నో ఆరోగ్య, ఆధ్యాత్మిక, జ్యోతిష్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని వివిధ శాస్త్రాలు చెబుతున్నాయి. కాలం మారినా బొట్టు రూపం మారినా.. అది మహిళలకు సంపూర్ణమైన లుక్ ఇవ్వడంతో పాటు శరీరానికి, మనస్సుకు సమతుల్యతను అందిస్తుంది. మరి […]
Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ ప్రాంత ప్రజలతో తమ కుటుంబానికి గత 40 ఏళ్లుగా అనుబంధం ఉందని, సహాయం కోసం వచ్చిన వారందరికీ అండగా నిలిచామని ఆయన తెలిపారు. అన్ని కులాలు, మతాల వారితో తమకున్న సంబంధాల కారణంగానే ప్రజలు తనను ఒక సెక్యులర్ నాయకుడిగా భావించారని అన్నారు. అందుకే 2014లో MIM పార్టీ తరఫున పోటీ చేసినా.. ప్రజలు తనకు […]
Gorilla Getup: మెదక్ జిల్లాలోని నర్సాపూర్ పట్టణంలో కొన్నాళ్లుగా ప్రజలను తీవ్రంగా వేధిస్తున్న వానరల బెడదను తగ్గించేందుకు స్థానిక యువత వినూత్న పరిష్కారాన్ని కనుగొంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కోతుల బాధ తప్పకపోవడంతో.. యువత యూట్యూబ్లో పరిష్కార మార్గాల కోసం అన్వేషించింది. ఈ నేపథ్యంలో వారు కాస్త వెరైటీ ఉపాయం కనుగొన్నారు. అదే ‘గెరిల్లా గెటప్’. అవునండి బాబు కోతులను భయబ్రాంతులకు గురి చేయడానికి ఒక వ్యక్తిని అచ్చం పెద్ద గొరిల్లా వేషం ఉన్న డ్రెస్ వేసుకొని […]