Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళా చివరి వారంలోకి ప్రవేశించడంతో, ఫిబ్రవరి 26న ముగియనున్న ఈ మహోత్సవానికి మరో అద్భుతమైన ఖగోళ ఘట్టం తోడవ్వనుంది. ఫిబ్రవరి 28న సౌర మండలంలోని ఏడు గ్రహాలన్నీ ఒకేసారి రాత్రి ఆకాశంలో ప్రత్యక్షమయ్యే అరుదైన దృశ్యం మనకు కనువిందు చేయనుంది. సూర్యుడి చుట్టూ పరిభ్రమించే బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ ఏడు గ్రహాలు ఒకే సరళ రేఖపై రానున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. రాత్రి సమయంలో భారతదేశం నుంచి చూడటానికి అవకాశం ఉంటుంది. ఈ గ్రహాల కలయిక మహా కుంభమేళాకు మరో విశిష్టతను తీసుకువచ్చినట్లు కొందరు భావిస్తున్నారు. ఖగోళ విశేషాలు, ఆధ్యాత్మిక శక్తుల మధ్య సంబంధం ఉందని నమ్మేవారికి ఇది మరింత ప్రాముఖ్యత కలిగిన సంఘటనగా మారింది.
Read Also: Bird Flu: 95 గ్రామాలలో నాటుకోళ్లకు బర్డ్ ఫ్లూ.. లబోదిబోమంటున్న పెంపకం దారులు!
ఈ గ్రహాల పరేడ్ 2025 జనవరిలో మొదట శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ కనిపించడం మొదలైంది. ఇక చివరిగా బుధుడు కూడా ఈ సమూహానికి చేరి ఫిబ్రవరి 28న ఈ గ్రహ సముదాయం కనువిందు చేయనుంది. ఈ గ్రహాలు సూర్యుని మార్గాన్ని సూచించే ఎక్లిప్టిక్ వెంట ఒకే వరుసలో కనిపిస్తాయి. ఇవన్నీ ఒకే రేఖపై ఉండటంతో అద్భుతమైన గ్రహ పరేడ్‌ను చూడవచ్చు. ఇక వీటిలో ఐదు గ్రహాలు బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని లను అత్యంత స్పష్టంగా కంటిచూపుతోనే చూడవచ్చు. అయితే యురేనస్, నెప్ట్యూన్ లను చాలా మసకబారిన గ్రహాలుగా ఉండడం వల్ల వీటిని చూడటానికి బైనాక్యులర్‌లు లేదా టెలిస్కోప్ అవసరం.
Read Also: Matrimonial Sites: మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లే టార్గెట్.. పెళ్లి పేరుతో 15 మందిపై లైంగిక వేధింపులు
ఉత్తమ వీక్షణ సమయం సాయంత్రం సూర్యాస్తమయానికి తర్వత నుండి ఉదయం సూర్యోదయానికి ముందే వీక్షంచవచ్చని తెలుస్తోంది. ఈ సమయంలో గ్రహాలు ఆకాశంలో స్పష్టంగా కనిపిస్తాయి. ఈ అరుదైన ఖగోళ ఘటన మనకు ఖగోళ శాస్త్రంలో ఎంతగానో ఆసక్తిని రేకెత్తించడమే కాకుండా, మహా కుంభమేళా సమయంలో జరగడం విశేషంగా మారింది. ఖగోళ ప్రేమికులు, ఆధ్యాత్మిక సాధకులు, ఇంకా సాధారణ ప్రజలు కూడా ఈ అద్భుతమైన గ్రహ సమూహాన్ని వీక్షించి ఆనందించవచ్చు.