‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో తిరుగులేని పాపులారిటి సంపాదించుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఒక మంచి కుటుంబ కథ చిత్రం తో వచ్చి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒకరిని ఎంటర్‌టైన్ చేశాడు. దీంతో ప్రతి ఒక స్టార్ హీరోలు అనిల్ తో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.ఇక ప్రస్తుతం అనిల్ మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా రూపొందించే ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే సంక్రాంతి రిలీజ్ టార్గెట్‌గా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు. అయితే కథ ఏంటి నటినటులు ఎవరు అనే విషయాలేవీ బయటకు రానప్పటికీ తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.
Also Read:Rakul Preet Singh: తన భర్త గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టిన రకుల్
చిరు మాట్లాడుతూ.. ‘అనిల్ రావిపూడి తో ఓ ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సమ్మర్ లో ప్రారంభించాలి అనుకుంటున్నాం. పూర్తిస్థాయి వినోదాత్మకంగా ఉండబోతున్న ఈ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టేందుకు నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని చిరు తెలిపాడు. అలాగే అనిల్ రావిపూడి గురించి కూడా మాట్లాడుతూ.. ‘సినిమాలో ఆయా సన్నివేశాల గురించి అనిల్ రావిపూడి నాకు చెబుతుంటే కడుపుబ్బా నవ్వుకున్నాను. దర్శకుడు కోదండ రామిరెడ్డితో పని చేసిన సమయంలో ఎలాంటి ఫీలింగ్ ఉందో.. ఇప్పుడు అనిల్‌తో అలాంటి ఫీలింగే ఉంది. ఈ చిత్రం ఖచ్చితంగా అభిమానులకు నచ్చుతుంది’ అని చిరంజీవి తెలిపారు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చిరు ఈ మూవీ కోసం అత్రుతగా ఉన్నట్లు కనిపిస్తోంది.