Noman Ali: ముల్తాన్ వేదికగా పాకిస్థాన్, వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. జనవరి 25 శనివారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో 38 ఏళ్ల నోమన్ అలీ తన స్పిన్ బౌలింగ్‌తో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌పై ప్రతాపం చూపించాడు. మ్యాచ్‌లో తొలిరోజే హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో ఈ ఘనత సాధించిన తొలి పాక్ స్పిన్నర్ గా రికార్డ్ సృష్టించాడు. టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే నోమన్ దెబ్బకు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్ వద్ద సమాధానం లేకపోయింది. మొత్తానికి వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్ లో 163 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
Also Read: Saif Ali Khan: సైఫ్ కేసులో కొత్త ట్విస్టు.. భార్యాభర్తల మాటల్లో తేడా!
గత కొద్దీ రోజులుగా కెప్టెన్ షాన్ మసూద్‌కు నోమన్ అలీ ట్రంప్ కార్డ్‌గా నిలిచాడు. దాంతో, ముల్తాన్ టెస్టు తొలి రోజు 8వ ఓవర్‌లో షాన్ అతనికి బంతిని అందించాడు. దీని తర్వాత, నోమన్ తన స్పిన్ బౌలింగ్‌లోని మ్యాజిక్‌ను చూపించాడు. దాంతో తాను వేసిన రెండవ ఓవర్‌లోనే వికెట్ తీశాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చి ఒకదాని తర్వాత ఒకటిగా 3 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. అతను ఓవర్ మొదటి మూడు బంతుల్లో జస్టిన్ గ్రీవ్స్, టెవిన్ ఇమ్లాచ్, కెవిన్ సింక్లైర్‌లను అవుట్ చేయడం ద్వారా తన హ్యాట్రిక్ పూర్తి చేశాడు. టెస్టుల్లో ఈ ఘనత సాధించిన తొలి పాక్ స్పిన్నర్ గా నోమన్ రికార్డ్ సృష్టించాడు.
𝐎𝐧𝐞 𝐢𝐧𝐜𝐫𝐞𝐝𝐢𝐛𝐥𝐞 𝐟𝐞𝐚𝐭! 😍
Hat-trick hero Noman Ali makes history in Multan 🙌#PAKvWI | #RedBallRumble pic.twitter.com/2xRLeYpVXl
— Pakistan Cricket (@TheRealPCB) January 25, 2025