CSK vs PBKS: నేడు చెన్నై లోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్‌తో తలపడే చెన్నై సూపర్ కింగ్స్ గెలవాలని చూస్తుంది. రెగ్యులర్ కెప్టెన్ రితురాజ్ గైక్వాడ్ గాయం తర్వాత కూడా ఎంఎస్ ధోని నాయకత్వంలో చెన్నై ప్రదర్శన ఏమి మారలేదు. సీఎస్కే జట్టు ఏడు […]
FDI Cyber Lab: హైదరాబాద్ నగరంలో డిజిటల్ ఫోరెన్సిక్స్, డేటా రికవరీ రంగాల్లో కీలక ముందడుగుగా FDI ల్యాబ్స్ నాంపల్లిలో తన తొలి అత్యాధునిక సైబర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. ఇండియన్ ఆఫీస్ ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రత్యేక విభాగంగా పని చేసే ఈ ల్యాబ్, డిజిటల్ భద్రతా అవసరాల పరిష్కారానికి కీలక కేంద్రంగా మారనుందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఆధునిక సైబర్ ల్యాబ్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ.. వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వ విభాగాలకు డేటా […]
Hyderabad: హైదరాబాదు సిటీ పోలీసు కమిషనరేట్ పునః వ్యవస్థీకరణలో భాగంగా తీసుకున్న కొత్త నిర్ణయాలు, వాటి వివరాలను సీపీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ ను 35 సంవత్సరాల తర్వాత జి.ఓ.ఎం.ఎస్. నెం. 32, (హోం లీగల్ డిపార్ట్మెంట్) ద్వారా తేది 30.04.2023 నాడు పోలీసు పునః వ్యవస్థీకరణ చేయడానికి ఉత్తర్వులు చేసారు. ఈ జి.ఓ. ప్రకారం రెండు అదనపు లా అండ్ ఆర్డర్ జోన్లు (సౌత్ ఈస్ట్ + సౌత్ వెస్ట్), 11 […]
TGSRTC Strike: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ సమ్మె నోటీసుపై స్పందిస్తూ.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమ్మెపై పునరాలోచించాలని కోరారు. ఈ సమయంలో ఆర్టీసీ సమ్మెకు అనుకూల పరిస్థితులు లేవని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి పూర్తిగా సానుకూలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పోరాటం ఎంతో కీలకంగా నిలిచిందని గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, సంస్థ […]
CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కులగణనపై కేంద్రం తీసుకున్న నిర్ణయం పై తాజాగా స్పందించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా కులగలను చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని, భారత్ జోడో లో చెప్పిన మాట ప్రకారం కులగణన చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం అసెంబ్లీ తీర్మానం చేశామని. ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ గాంధీ విజయం అమలులోకి వచ్చిందని ఈ సందర్బంగా తెలిపారు. తెలంగాణ […]
Ponnam Prabhakar: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కేంద్రీకృత పోర్టల్ ‘‘వాహన్ సారథి’’లోకి నేడు ( ఏప్రిల్ 30)న తెలంగాణ రాష్ట్రము చేరింది. సికింద్రాబాద్ లో ఉన్న RTO కార్యాలయంలో పైలెట్ ప్రాజెక్ట్ గా ‘సారధి పోర్టల్’ ప్రారంభోత్సవం చేసారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో వాహనదారులకు డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కొత్తగా సారధి పోర్టల్ ను లాంచ్ చేశారు. వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అన్ని సేవలను సులభతరం చేసేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. […]
CRPF: ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో విస్తరించిన కర్రెగుట్టలపై భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. గత 9 రోజులుగా కొనసాగిన ఈ ఆపరేషన్‌లో కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఘనవిజయం సాధించింది. మావోయిస్టుల చొరబాట్లకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. డ్రోన్లు, హెలికాప్టర్ల సహాయంతో అడవుల్లో కష్టమైన ప్రదేశాలను గుర్తించి సమర్థవంతంగా భద్రతా బలగాలు తనిఖీలు జరిపాయి. ఈ ఆపరేషన్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంతో ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) చీఫ్ స్వయంగా కర్రెగుట్ట […]
Revanth Reddy: హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో పదవ తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేసిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన మహాత్మ బసవేశ్వర జయంతి ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విప్లవకారుడు అంటే తుపాకీ పట్టుకోవాల్సిన అవసరం లేదని, విప్లవాత్మక మార్పు తెచ్చే ఎవరైనా విప్లవకారుడని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ పై బసవేశ్వరుడు ప్రభావం ఎక్కువని సీఎం అన్నారు. ప్రభుత్వ తప్పిదాలు సరిదిద్దేలా ప్రతిపక్ష వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నామని […]
Summer Holidays: రాష్ట్రంలోని అంగన్వాడీ చిన్నారులకు మంత్రి సీతక్క ఆదేశాల మేరకు నెల రోజుల పాటు సెలవులు ప్రకటించారు. తల్లిదండ్రులు, అంగన్వాడీ యూనియన్ల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ లో బుధవారం నాడు అంగన్వాడీ యూనియన్లతో డైరెక్టర్ కాంతి వెస్లీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎండలు మండుతున్న నేపథ్యంలో మే 1 నుంచి సెలవులు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే అంగన్వాడీ లబ్దిదారులకు పౌష్టికాహారం అందించేలా ప్రత్యేక […]
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో అక్రమాలు, అవినీతి ఆరోపణలతోపాటు తీవ్రమైన తప్పిదాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతోపాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రంగంలోకి దిగారు. వేలాది మంది అభ్యర్థులు ఆయనను కలిసి గ్రూప్-1 అక్రమాలపై వినతి పత్రాలు అందజేస్తుండటంతోపాటు ఆ నియామకాలను రద్దు చేయాలని, మళ్లీ పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లాలని కోరుతున్న నేపథ్యంలో బండి సంజయ్ గ్రూప్-1 పరీక్షా ఫలితాలపై టీజీపీఎస్సీ నుండి సమాచారం తెప్పించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు […]