Revanth Reddy: హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో పదవ తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేసిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన మహాత్మ బసవేశ్వర జయంతి ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విప్లవకారుడు అంటే తుపాకీ పట్టుకోవాల్సిన అవసరం లేదని, విప్లవాత్మక మార్పు తెచ్చే ఎవరైనా విప్లవకారుడని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ పై బసవేశ్వరుడు ప్రభావం ఎక్కువని సీఎం అన్నారు. ప్రభుత్వ తప్పిదాలు సరిదిద్దేలా ప్రతిపక్ష వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నామని అలాగే, ప్రజల అభివృద్ధి జీవన ప్రమాణాలు పెంచేలా రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నట్లు ఆయన మాట్లాడారు. శాసన సభలో సభ నాయకుడిగా నేను, మంత్రులం అంతా పాల్గొన్నామని తెలిపారు. అయితే, నిన్నగాక మొన్న ఒకాయన వరంగల్ లో సభ పెట్టిండని, అయితే మాకేం అభ్యంతరం లేదన్నారు. ఇక సభకు ఎన్ని వందల బస్సులు అడిగితే అన్ని ఇవ్వండి అని మంత్రి పొన్నంకి చెప్పానని, అధికార పక్షమే కాదు.. ప్రతిపక్ష పార్టీ కూడా ఉండాలని అందుకు సహకరించామని ఆయన ఈ సందర్బంగా తెలిపారు.
Read Also: Summer Holidays: అంగన్వాడీ చిన్నారులకు వేసవి సెలవులు ప్రకటన..!
అయితే, సభలో ప్రజల సమస్యలు ఏదైనా ప్రస్తావించారా..? మా లోపాలు చెప్పినవా..? మంచిని అభినందించావా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వం నుండి జీత భత్యాలు తీసుకుంటున్నారు.. ఏ చట్టంలో ఉన్నది, జీతాలు తీసుకుని పని చేయడం అని అంటూనే.. అన్ని వసతులు అనుభవిస్తూ, ప్రతిపక్ష పాత్ర పోషించకపోతే ఎలా అంటూ మండి పడ్డారు. అసెంబ్లీకి తాను రాను.. పిల్లల్ని పంపిస్తా అంటాడని సీఎం పేర్కొన్నారు. అయితే, మీరెందుకు మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం..? మీకు ఎక్కడిది మమ్మల్ని అడిగే హక్కు.. ప్రతిపక్ష హోదా నీకు ఎందుకు? ఫార్మ్ హౌస్ లో పడుకుని ఏం సందేశం ఇస్తున్నారు? అధికారంలో ఉంటే చెలాయిస్తాం.. లేదంటే అసెంబ్లీకే రాను అంటే ఎట్లా? మేము ఇచ్చినవి అగినయి అంటున్నావు.. ఏమి అగినయని సీఎం ప్రశ్నించారు.
Read Also: Pakistan: ‘‘అయోధ్యలో బాబ్రీ మసీదు, అజాన్ పఠించేది పాక్ ఆర్మీ చీఫ్, సిక్కులు యుద్ధం చేయొద్దు’’..
మీరు సభకు రారు… కాబట్టి మేం ఏం చేస్తున్నామో ఎట్లా తెలుస్తుంది? మీరు ఏ మత్తులో జోగుతున్నారో తెలియదు.. విద్వేష పూరిత ప్రసంగం చేసి.. ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారాని సీఎం రేవంత్ ఆగ్రహించారు. పదేళ్లు మేమే అధికారంలో ఉంటాము.. అదే పదేళ్లు ఫార్మ్ హౌస్ లోనే ఉంటావు.. తర్వాత నీ చరిత్ర ఫార్మ్ హౌస్ లోనే పరిసమాప్తం అంటూ ఎద్దేవా చేసారు. మీ కుటుంబం పదేళ్లు దోచుకోలేదా..? దేని మీద చర్చ చేద్దామో చెప్పు, సభ పెడదాం రా.. ప్రతిపక్ష నాయకుడిగా నిర్ణయాల్లో తప్పులు ఉంటే చెప్పండి సరిదిద్దుకుంటామని సీఎం మాట్లాడారు. అలాగే విషం చిమ్మే మాటలు వద్దు, ఆయన మాటల్లో, కండ్లల్లో విషం.. విచక్షణ ఉండాలి కదా… ఏం మాట్లాడుతున్నామో అని అన్నారు. మేము తెలంగాణ ఇస్తే.. పదేళ్లు దోచుకుని మమల్ని విలన్ అంటున్నావని ఫైర్ అయ్యారు. ప్రజలు అనాలి.. మీరు తెలంగాణ ఇస్తే… ఆయన ఆగం చేశారని మమ్మల్ని అనాలి, నువ్వు కాదని సీఎం అన్నారు.