YS Jagan: భోగాపురం ఎయిర్పోర్టు పేరుతో క్రెడిట్ చోరీ.. మా హయాంలోనే వేగంగా పనులు జరిగాయి..
- భోగాపురం ఎయిర్ పోర్టు పేరుతో క్రెడిట్ చోరీ చేస్తున్నారు..
- ఎయిర్ పోర్టు పేరుతో భూ దోపిడీకి పాల్పడాలని చూస్తున్నారు..
- భోగాపురం ఎయిర్ పోర్టుపై 139 కేసులు వేస్తే, పరిష్కరించి పనులు చేశాం..
- వైసీపీ హయాంలో భోగాపురం ఎయిర్ పోర్టు పనులు వేగంగా చేశాం: వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: భోగాపురం ఎయిర్ పోర్టు విషయంలో క్రెడిట్ చోరీ చేయటం చంద్రబాబు కోసం పడరాని పాట్లు పడుతున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు పేరుతో పెద్ద ఎత్తున భూ దోపిడికి ప్లాన్ చేసిన చంద్రబాబు.. 15 వేల ఎకరాల భూమి కావాలన్నారు.. దీనికి వ్యతిరేకంగా 130 కేసులు వేశారు.. మేం వచ్చాక 2,700 ఎకరాలకు కుదించి పనులు మొదలు పెట్టాం.. 2,200 ఎయిర్ పోర్టుకు.. ఎయిరో సిటీకి 500 ఎకరాలు కేటాయించామని తెలిపారు. మేం వచ్చాక కోర్టు కేసులు మొత్తం క్లియర్ చేశాం.. మూడు గ్రామాల్లో 400 కుటుంబాలు తరలించి కాలనీ కట్టాం.. ఆ రోజుల్లో విమానయాన మంత్రిగా అశోక్ గజపతి రాజు ఉన్నారు, చంద్రబాబు ఒక్క అనుమతి కూడా తెచ్చుకోలేక పోయారు.. మేం వచ్చాక కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వెంట పడ్డాం.. నేను స్వయంగా వెళ్ళి ప్రధానిని అనేక సార్లు కలిసి వినతి పత్రం ఇచ్చానని జగన్ వెల్లడించారు.
Read Also: Kolkata: ఎన్నికల వేళ కోల్‌కతాలో ఈడీ దాడులు.. సీఎం మమత హల్‌చల్
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ఇక, కావాల్సిన అనుమతులు మొత్తం మేమే తెచ్చాం అని జగన్ పేర్కొన్నారు. ప్రతీ పని మా హయంలోనే జరిగింది.. రోడ్లు, నీళ్లు, కరెంట్ కు కూడా మేమే నిధులు ఇచ్చాం.. కోవిడ్ లాంటి పరిస్థితుల్లో కూడా మేం ఫోకస్ చేసాం కాబట్టే శంకుస్థాపన చేశాం.. అప్పుడే చెప్పా 2026లో ఫస్ట్ ఫ్లైట్ ఎగురుతుంది అని.. వైజాగ్ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు వరకు ఆరు లైన్ల రహదారి కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ని అడిగాం.. మేం అడగటం వల్లే కేంద్రం శాంక్షన్ చేశామని స్వయంగా చెప్పారు… రెండేళ్ల నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు.. ఓవైపు ఎయిర్ పోర్టు పనులు పూర్తి అవుతుంటే రోడ్డు మీద మాత్రం ధ్యాస లేదని విమర్శించారు. కనీసం ఆ పని కూడా చేయలేదు.. కానీ చంద్రబాబు, ఆయన కేంద్రమంత్రి అంతా మేమే చేశాం అంటారు.. క్రెడిట్ విత్ ఔట్ కాంట్రిబ్యూషన్ అనేలా చంద్రబాబు మనస్తత్వం.. ఎవరో చేసిన దానికి క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడం చంద్రబాబుకు అలవాటే అని జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు
తాజావార్తలు
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabali: ‘రణబలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!