ఆర్థిక రాజధాని ముంబైలో మున్సిపల్ ఎన్నికల జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్‌కు సెలవు ప్రకటించినట్లుగా తెలుస్తోంది. క్యాలెండర్ ప్రకారం సెలవు కాకపోయినా ఎన్నికల నేపథ్యంలో సెలవు ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఆర్బీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Kolkata: ఎన్నికల వేళ కోల్‌కతాలో ఈడీ దాడులు.. సీఎం మమత హల్‌చల్
ఈనెల 15న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు 29 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. కీలకమైన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 15న ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. 1881 నాటి నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 25 కింద ఈ ఉత్తర్వు జారీ చేశారు. 1968 హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు అప్పగించబడ్డాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 15న సెలవు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడంతో జనవరి 15న BSE, NSE కూడా మూసేయవచ్చని సమాచారం.
ఇది కూడా చదవండి: Khawaja Asif: పాక్ రక్షణ మంత్రి గొప్పలు.. భారత్‌తో యుద్ధం తర్వాత హాట్ కేకుల్లా జెట్‌లు కొంటున్నారు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.74,000 కోట్లకు పైగా భారీ వార్షిక బడ్జెట్‌ను కలిగి ఉంది. అనేక సంవత్సరాలు శివసేన పాలించింది. ఈసారి ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మేయర్ పీఠం కోసం థాక్రే సోదరులు చేతులు కలిపారు. ఇంకోవైపు మహాయతి కూటమి బరిలోకి దిగింది. ముంబై ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కడతారో చూడాలి. ఎన్నికల ఫలితాలు మాత్రం జనవరి 16న విడుదల కానున్నాయి.
ముంబైలో మొత్తం 1,03,44,315 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 55,16,707 మంది పురుష ఓటర్లు, 48,26,509 మంది మహిళా ఓటర్లు, 1,099 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. 2017 స్థానిక సంస్థల ఎన్నికల్లో శివసేన 84 సీట్లు గెలుచుకుంది.