ఎలక్ట్రానిక్స్ విక్రయాల సంస్థ ‘విజయ్ సేల్స్’ తన యాపిల్ డేస్ సేల్‌ను జనవరి 8 వరకు పొడిగించింది. అంటే.. యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లు అద్భుతమైన ఆఫర్‌లను సద్వినియోగం చేసుకోవడానికి మరింత సమయం ఉంది. ఈ సేల్ దేశవ్యాప్తంగా ఉన్న విజయ్ సేల్స్ రిటైల్ స్టోర్‌లలో, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్‌లు, ఆపిల్ వాచీలు, ఎయిర్‌పాడ్‌లు సహా పలు ఉపకరణాలపై అద్భుతమైన డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.
యాపిల్ డేస్ సేల్ 2026లో ఐఫోన్ మోడల్స్‌పై ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కార్డులతో రూ.4,000 వరకు తక్షణ తగ్గింపు ఉంది. అదనంగా మీ పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే.. రూ.9,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఐఫోన్ 17 (256GB) ధర రూ.82,900 నుంచి ప్రారంభమవుతుంది. యాపిల్ డేస్ సేల్ డిస్కౌంట్ తర్వాత రూ.78,900కు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర వరుసగా రూ.1,22,990, రూ.1,35,990గా ఉంది. ఐఫోన్ ఎయిర్ (256GB) ధర రూ.91,990కు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 16 సిరీస్ ధర రూ.59,990 నుంచి ప్రారంభమవుతుంది.
ఈ సేల్‌లో మాక్‌బుక్ కొనుగోలుదారులకు ఆఫర్లు ఉన్నాయి. M4 చిప్‌తో కూడిన 13-అంగుళాల మాక్‌బుక్ ఎయిర్‌పై రూ.10,000 తక్షణ తగ్గింపు ఉంది. తగ్గింపు అనంతరం రూ.80,990కి అందుబాటులో ఉంది. రూ.10,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. 15-అంగుళాల M4 మాక్‌బుక్ ఎయిర్ ధర రూ.1,02,490గా.. M5 చిప్‌తో కూడిన మాక్‌బుక్ ప్రోను రూ.1,52,990కి కొనుగోలు చేయవచ్చు. 11వ జనరేషన్ మోడల్ ఐప్యాడ్ రూ.30,190కి అందుబాటులో ఉంది. M3 చిప్‌తో కూడిన ఐప్యాడ్ ఎయిర్, M5 చిప్‌తో కూడిన ఐప్యాడ్ ప్రో అన్ని వేరియంట్‌లపై రూ.3,000 ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు.
Also Read: Motorola Edge 50 Pro Price Cut: అమెజాన్‌లో సూపర్ డీల్.. మోటరోలా ఎడ్జ్ 50 ప్రోపై 13 వేల తగ్గింపు!
యాపిల్ వాచ్ సిరీస్ 11 ధర రూ.40,990 కాగా.. యాపిల్ వాచ్ అల్ట్రా 3 ధర రూ.78,990కి లభిస్తుంది. ఎయిర్‌పాడ్‌లు, బీట్స్ ఆడియో ఉత్పత్తులపై కూడా డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. విజయ్ సేల్స్ AppleCare+ లేదా Protect+ ప్లాన్‌లపై 20 శాతం వరకు తగ్గింపును కూడా అందిస్తోంది. ఎంపిక చేసిన ఐఫోన్ కొనుగోళ్లు MyVS రివార్డ్స్ ద్వారా లాయల్టీ పాయింట్లను కూడా పొందవచ్చు. యాపిల్ డేస్ సేల్ ఇప్పుడు జనవరి 8 వరకు కొనసాగుతుంది. ఆఫర్లు పరిమిత స్టాక్‌పై చెల్లుబాటు అవుతాయి.