Ponnam Prabhakar: మంత్రి చేతుల మీదుగా ‘సారధి పోర్టల్’ ప్రారంభోత్సవం..!
- సికింద్రాబాద్ RTO కార్యాలయంలో పైలెట్ ప్రాజెక్ట్ గా సారధి పోర్టల్ ప్రారంభోత్సవం
- పోర్టల్ ప్రారంభించిన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్...
- వాహనదారులకు డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కొత్తగా సారధి పోర్టల్ ను లాంచ్
- రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ సేవలను సులభతరం చేసేందుకు ఉపయోగపడనున్న పోర్టల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కేంద్రీకృత పోర్టల్ ‘‘వాహన్ సారథి’’లోకి నేడు ( ఏప్రిల్ 30)న తెలంగాణ రాష్ట్రము చేరింది. సికింద్రాబాద్ లో ఉన్న RTO కార్యాలయంలో పైలెట్ ప్రాజెక్ట్ గా ‘సారధి పోర్టల్’ ప్రారంభోత్సవం చేసారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో వాహనదారులకు డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కొత్తగా సారధి పోర్టల్ ను లాంచ్ చేశారు. వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అన్ని సేవలను సులభతరం చేసేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీ గణేష్, ప్రిన్సిపాల్ సెక్రెటరీ వికాస్ రాజ్, ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ సురేందర్ మోహన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి లతోపాటు రవాణా శాఖ అధికారులు హాజరయ్యారు.
Read Also: CRPF: సీఆర్పీఎఫ్ ఆపరేషన్ విజయవంతం.. కర్రెగుట్టలపై బేస్ క్యాంప్ ఏర్పాటు..!
Also Read
- INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
ఈ వాహన్ సారథి పోర్టల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహన రిజిస్ట్రేషన్‌లను సులభతరం చేయడంల దోహద పడనుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఆర్టీఓ కార్యకలాపాలను ఆటోమేట్ చేస్తుంది. ఇందులో వాహనాలకు సంబంధించి పర్మిట్‌లు, అలాగే డ్రైవింగ్ స్కూల్ లైసెన్స్‌లు వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే ఈ పోర్టల్ లో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు అనుసంధానమైనా.. ఇన్ని సంవత్సరాల తర్వాత జాతీయ పోర్టల్ లో చేరాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ సమాచార కేంద్రం ద్వారా వాహనాలకు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లకు సంబంధించిన అన్ని రకాల వివరాలన్నింటిని ఈ పోర్టల్ నమోదు చేయనుంది. ఈ పోర్టల్ ద్వారా దేశంలోని ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వాహన రిజిస్ట్రేషన్ బదిలీ, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, అడ్రస్ మార్పుల వంటి పనులను చేసుకునే అవకాశం కలగనుంది.
Read Also: India Pakistan: భారత్ దెబ్బ అదుర్స్.. పాకిస్తాన్‌లో ఎండిపోయిన చీనాబ్ నది..
ఈ సందర్బంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రవాణా శాఖా కేంద్రం, రాష్ట్రాలు కలిపి నడిపించాల్సిన వ్యవస్థ. కేంద్ర తెచ్చిన వాహన సారధి పోర్టల్ ను ఆలస్యంగా మనం భాగం అయ్యాము. ఈ అనుసంధానం వల్ల ఫెడరల్ సిస్టంలో భాగం అయ్యామని ఆయన అన్నారు. రవాణా శాఖాలో సంస్కరణలు తీసుకొస్తున్నాం.. ప్రమాదాల నివారణ కోసం రోడ్ భద్రతా అవగాహన కార్యక్రమాలు చేపట్టాం.. పిల్లలకు రోడ్ అవేర్నెస్ పార్క్ లను ఏర్పాటు చేశామని, అందుకు పిల్లలకు అవగాహన అవసరమని అన్నారు. AI ద్వారా రవాణా శాఖలో తప్పు చేస్తే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ లాంటివి నిర్వహిస్తామని.. పొల్యూషన్ పెరగకుండా పాలసీ తీసుకొచ్చాం.., 15 ఏళ్ళు దాటిన వాహనాలకు స్క్రాప్ పాలసీ తీసుకొచ్చాం.. ప్రభుత్వం ఎన్ని నిర్ణయాలు తీసుకున్న వాహనదారుల సపోర్ట్ అవసరమని ఆయన అన్నారు. మధ్యవర్తిత్వం అవసరం లేకుండా ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. కుల గణన పై కేంద్రం కూడా తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ ను పరిగణనలోకి తీసుకుంటాం అని చెప్పింది. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఇది తెలంగాణ ప్రభుత్వ విజయమని, కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.
తాజావార్తలు
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు