Amazon Pay Fixed Deposit: భారతదేశంలో సురక్షిత పెట్టుబడుల విషయానికి వస్తే ముందుగా గుర్తొచ్చేది ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD). బ్యాంకులు సాధారణంగా 6 నుంచి 7 శాతం వరకు మాత్రమే వడ్డీ ఇస్తుండగా, ఇప్పుడు అమెజాన్ పే (Amazon Pay) వినియోగదారులకు కొత్త డిజిటల్ ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా అమెజాన్ పే FD ఇన్వెస్ట్‌మెంట్ సర్వీస్ ను ప్రారంభించింది. ఈ సర్వీస్ ద్వారా యూజర్లు నేరుగా అమెజాన్ పే యాప్ నుంచే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయవచ్చు.
అమెజాన్ పే FD సర్వీస్‌లో ప్రత్యేకత ఏమిటి?
ఈ కొత్త సర్వీస్ సురక్షితమైన, స్థిరమైన రిటర్న్స్ కోరుకునే పెట్టుబడిదారులను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడానికి ప్రత్యేకంగా కొత్త సేవింగ్స్ అకౌంట్ తెరవాల్సిన అవసరం లేదు. మొత్తం ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌గా అమెజాన్ యాప్ లోపలే పూర్తవుతుంది. కనీస పెట్టుబడి రూ.1,000 నుంచే ప్రారంభమవుతుండగా.. గరిష్టంగా ఏటా 8 శాతం వరకు వడ్డీ పొందే అవకాశం ఉంది.
Vaibhav Suryavanshi: సరికొత్త చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ..
కంపెనీ ప్రకారం భారతదేశంలో ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ప్రోడక్ట్స్‌కు మంచి డిమాండ్ ఉంది. 2026 ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ఈ సర్వీస్‌ను మళ్లీ మరింత బలమైన భాగస్వాములతో రీ-లాంచ్ చేసింది. అమెజాన్ పే FD సర్వీస్ కోసం పలు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, NBFCలు తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. NBFC పార్ట్నర్లుగా శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి. ఈ సంస్థలు వివిధ కాలపరిమితులు, వడ్డీ రేట్లతో FD ఎంపికలను అందిస్తున్నాయి.
వడ్డీ రేట్లు, భద్రత ఎలా ఉంది?
అమెజాన్ పే FD ద్వారా గరిష్టంగా 8 శాతం వరకు వార్షిక వడ్డీ పొందవచ్చు. శ్రీరామ్ ఫైనాన్స్ మహిళా పెట్టుబడిదారులకు అదనంగా 0.5 శాతం వడ్డీని కూడా అందిస్తోంది. బ్యాంక్ FDలపై రూ.5 లక్షల వరకు పెట్టుబడికి DICGC ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఇది RBIకి అనుబంధ సంస్థ అయిన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా అందించబడుతుంది. దీంతో పెట్టుబడిదారులకు అదనపు భద్రత లభిస్తుంది.
Amazon Pay యాప్ ద్వారా FD ఎలా చేయాలి?
FD పెట్టుబడి ప్రక్రియను చాలా సులభంగా రూపొందించారు. ఇందుకొసం..
* అమెజాన్ యాప్ ఓపెన్ చేసి ‘Amazon Pay’ సెక్షన్‌లోకి వెళ్లాలి.
* ‘Fixed Deposit’ ఆప్షన్ ఎంచుకోవాలి.
* నిబంధనలు అంగీకరించి, బ్యాంక్ లేదా NBFCను సెలెక్ట్ చేయాలి.
* పెట్టుబడి మొత్తం, కాలపరిమితి నమోదు చేసి డిజిటల్‌గా పూర్తి చేయాలి.
పెట్టుబడికి ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు:
అమెజాన్ పే కేవలం ఒక ప్లాట్‌ఫామ్ మాత్రమే. అసలు FD బ్యాంక్ లేదా NBFC వద్దనే ఓపెన్ అవుతుంది. కాబట్టి పెట్టుబడి చేసే ముందు వడ్డీ రేట్లు, కాలపరిమితి, ముందస్తు ఉపసంహరణ నిబంధనలు, పార్ట్నర్ సంస్థ క్రెడిట్ రేటింగ్ వంటి అంశాలను తప్పకుండా పరిశీలించాలి. మొత్తంగా చూస్తే అమెజాన్ పే FD సర్వీస్ డిజిటల్ సౌలభ్యంతో పాటు మంచి రాబడిని అందించే ఒక ఆకర్షణీయమైన పెట్టుబడి ఎంపికగా మారుతోంది.