మూడు వరుస ఘన విజయాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి, 2026 సంక్రాంతికి తన తదుపరి చిత్రం ‘అనగనగా ఒక రాజు’తో అలరించనున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయిక. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.
అసలుసిసలైన పండగ చిత్రంగా జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టనున్న ‘అనగనగా ఒక రాజు’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను పెంచేలా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చెసారు మేకర్స్. ఏ మాటకామాట ట్రైలర్ చూసాక అసలైన పండగ సినిమా అంటే ఇది అని అనిపిస్తుంది. అనగనగ ఒక రాజు ఆ రాజుకు చాలా పెద్ద మనసు.. అని అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయి.. నవీన్ పోలిశెట్టి కామెడీ పంచులు.. మీనాక్షి చౌదరి అమాయకత్వం ఆద్యంతం నవ్వులు పూయించాయి. ఒక్కమాటలో చెప్పాలంటే సంక్రాంతికి అసలైన తెలుగు సినిమా మాదిరిగా ట్రయిలర్ ఆకట్టుకుంది. ఇక ట్రైలర్ స్టార్టింగ్ లో వచ్చే బలపం పట్టి భామ వొడిలో మ్యూజిక్ అయితే క్రేజీ అని చెప్పాలి. పొంగల్ కానుకగా వస్తున్న అనగనగ ఒకరాజు అందరికంటే మెప్పించాడు.
Also Read : TOXIC Glimpse : యష్ బర్త్ డే స్పెషల్.. టాక్సిక్ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్.. కొంచం యాక్షన్.. మరికొంత ఓవరాక్షన్