Motorola Signature: మోటరోలా (Motorola) పోర్ట్‌ఫోలియోలో తారా స్థాయిలో నిలిచేలా మోటోరోలా సిగ్నేచర్ (Motorola Signature) అనే కొత్త అల్ట్రా-ప్రీమియం సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. డిజైన్, కెమెరా, పనితీరు, ఏఐ, సస్టైనబిలిటీ అన్ని ఫ్లాగ్‌షిప్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేశారు.
ప్రీమియం డిజైన్:
మోటోరోలా సిగ్నేచర్ కేవలం 6.99mm అల్ట్రా-స్లిమ్ క్వాడ్-కర్వ్డ్ డిజైన్ తో వస్తోంది. ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌తో పాటు, చేతిలో పట్టుకున్నప్పుడు మంచి గ్రిప్ అందించే టెక్స్చర్డ్ బ్యాక్ ఫినిష్ దీనికి ఇచ్చారు. ఈ ఫోన్ పాంటోనే మార్టిని ఆలివ్, పాంటోనే కార్బన్ అనే రెండు ప్రీమియం స్టైలిష్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Warangal: వరంగల్ చౌరస్తాలో కత్తితో వివాహిత హల్చల్.. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని..
మొబైల్ స్లిమ్ బాడీ ఉన్నప్పటికీ.. MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ పొందింది. ఇంకా ఇది Gorilla Glass Victus 2 ప్రొటెక్షన్‌తో పాటు IP68 & IP69 రేటింగ్స్ ఉండటంతో ధూళి, నీటికి పూర్తిగా రక్షణ ఉంటుంది. 1.5 మీటర్ల లోతులో 30 నిమిషాల పాటు నీటిలో ఉన్నా ఎలాంటి సమస్య ఉండదు. అంతేకాదు.. అత్యధిక ఉష్ణోగ్రతలు, ఎత్తైన ప్రదేశాల్లో కూడా పని చేసేలా దీనిని డిజైన్ చేశారు.

సూపర్ AMOLED డిస్‌ప్లే:
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.8 అంగుళాల Extreme AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 165Hz రిఫ్రెష్ రేట్ ఉంది. అంటే ఇది స్టాండర్డ్ FHD కంటే 14% ఎక్కువ పిక్సెల్స్‌తో Super HD రిజల్యూషన్, గరిష్టంగా 6200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, పాంటోనే వాలిడేటెడ్ డిస్‌ప్లే కాలిబ్రేషన్, డాల్బీ విజన్ సపోర్ట్, వీడియోలు, గేమింగ్, కంటెంట్ వీక్షణలో ఇది టాప్-లెవల్ అనుభూతిని ఇస్తుంది.
ప్రొఫెషనల్ గ్రేడ్ కెమెరా సిస్టమ్:
మోటోరోలా సిగ్నేచర్ లో క్వాడ్ 50MP కెమెరా సెటప్ ఉంది. ఇమేజింగ్ పనితీరుకు DXOMARK గోల్డ్ లేబిల్ కూడా లభించింది. Sony LYTIA సెన్సార్లు, డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్, మోటో ai ప్రాసెసింగ్ దీని ప్రత్యేకతలు. ఇక మొబైల్ లో 50MP మెయిన్ కెమెరా (Sony LYTIA 828 సెన్సార్, 8K వీడియో రికార్డింగ్, 4K స్లో మోషన్, డాల్బీ విజన్ వీడియో, పాంటోనే వాలిడేటెడ్ కలర్ అండ్ స్కిన్ టోన్ అక్యూరసీ), 50MP పెరిస్కోప్ టెలిఫోటో (Sony LYTIA 600, 3x ఆప్టికల్ జూమ్, moto ai ఆధారిత 100x సూపర్ జూమ్ ప్రో, 71mm ఈక్వివలెంట్ ఫోకల్ లెంగ్త్), 50MP అల్ట్రావైడ్ కెమెరా 122° ఫీల్డ్ ఆఫ్ వ్యూ, మాక్రో సపోర్ట్ లతో పాటు 50MP ఫ్రంట్ కెమెరా (Sony LYTIA 500, Quad Pixel టెక్నాలజీ, 4K వీడియో)లు ఉన్నాయి.
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ ట్రోఫీ కోసం.. న్యూజిలాండ్ సీక్రెట్ ప్లాన్!
ప్రాసెసర్ & కూలింగ్:
ఈ ఫోన్‌లో 3nm Snapdragon 8 Gen 5 Mobile Platform ఉపయోగించారు. ఇది గరిష్టంగా 3.8GHz CPU స్పీడ్, మెరుగైన GPU పనితీరు అందిస్తుంది. శక్తివంతమైన NPU ద్వారా ఆన్-డివైస్ AI ప్రాసెసింగ్ ను అందిస్తుంది. ఇంకా ప్రత్యేకంగా ప్రపంచంలోనే తొలిసారిగా కాపర్ మెష్ లిక్విడ్ మెటల్ కూలింగ్ సిస్టంను ఉపయోగించారు. దీని వల్ల గేమింగ్, హెవీ వర్క్‌లో కూడా హీట్ కంట్రోల్ సమర్థంగా ఉంటుంది.

బ్యాటరీ & ఫాస్ట్ ఛార్జింగ్:
మోటోరోలా సిగ్నేచర్ లో 5200mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. ఇది గరిష్టంగా 52 గంటల బ్యాటరీ లైఫ్, 57 గంటల మ్యూజిక్ స్ట్రీమింగ్, 28 గంటల వీడియో ప్లేబ్యాక్ అందిస్తుంది. దీనికి 90W TurboPower వైర్డ్ ఛార్జింగ్ ద్వారా కేవలం 7 నిమిషాల్లో ఒక రోజు పవర్ అందుతుందని మోటరోలా చెబుతోంది. అలాగే 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
ఆడియో, సాఫ్ట్‌వేర్ & AI:
ఆడియో పరంగా ఈ ఫోన్ నిజంగా ప్రీమియం అని చెప్పవచ్చు. ఇందులో సౌండ్ బై బోస్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, డాల్బీ ఆటమ్స్, Hi-Res ఆడియో సర్టిఫికేషన్, స్నాప్ డ్రాగన్ సౌండ్ & aptX లాస్ లెస్ ఫీచర్స్ ఉన్నాయి. సాఫ్ట్‌వేర్‌గా ఇది Android 16 తో వస్తుంది. మోటరోలా 7 Android OS అప్డేట్స్ మరియు 7 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ హామీ ఇస్తోంది. moto ai ఫీచర్లు ఇమేజ్ రికగ్నిషన్, వాయిస్ అసిస్టెన్స్, పవర్ ఆప్టిమైజేషన్‌లో సహాయపడతాయి.
Bollywood : బాలీవుడ్ కల్ట్ సాంగ్స్‌ను రీమిక్స్ చేస్తున్న స్టార్స్

Image (1)
ధర:
ఈ కొత్త మొబైల్ యూరప్‌లో EUR 999 ప్రారంభ ధరతో లాంచ్ అవుతోంది (భారత కరెన్సీలో రూ. 1,05,000). మొదట యూరప్ మార్కెట్లలో అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా-పసిఫిక్ ప్రాంతాలకు విస్తరించనుంది. ఇప్పటికే మోటరోలా భారత్‌లో ఈ ఫోన్ లాంచ్‌ను టీజ్ చేయడం ప్రారంభించింది. కాబట్టి త్వరలోనే ఇండియన్ మార్కెట్‌లోకి కూడా వచ్చే అవకాశం ఉందని అంచనా.