RV Karnan: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సమగ్ర వివరణ ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధి గతంలో 650 చదరపు కిలోమీటర్లుగా ఉండగా, ప్రస్తుతం 2060 చదరపు కిలోమీటర్లకు విస్తరించిందని తెలిపారు. ఈ విస్తరణతో దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన మున్సిపల్ కార్పొరేషన్‌గా జీహెచ్ఎంసీ మారిందన్నారు. వార్డుల విభజన ప్రక్రియను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌తో పాటు జీహెచ్ఎంసీ అధికారులు సమగ్రంగా ఎక్సర్సైజ్ చేసి రూపొందించారని కమిషనర్ […]
Kishan Reddy: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన సమావేశం విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. సమావేశంలో జరిగిన విషయాలను బయటకు లీక్ చేయడం పూర్తిగా తప్పని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో లీక్ వీరులు ఎవరో తెలిసిన వెంటనే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధానమంత్రితో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను బయటకు చెప్పొద్దని పీఎం స్వయంగా స్పష్టంగా సూచించారని కిషన్ రెడ్డి తెలిపారు. అయినప్పటికీ, లోపల జరిగినది […]
Vikarabad: వికారాబాద్ జిల్లా దోమ మండలం రాకొండ గ్రామంలో అర్థరాత్రి చోటుచేసుకున్న హింసాత్మక ఘటన కలకలం రేపింది. గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అర్జున్‌పై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం, అర్థరాత్రి ముసుగు వేసుకుని వచ్చిన వ్యక్తి అకస్మాత్తుగా అర్జున్‌పై దాడి చేసి పరారయ్యాడు. ఈ దాడిలో అర్జున్‌కు పొత్తికడుపు భాగంలో మూడు చోట్ల తీవ్ర గాయాలు అయ్యాయి. […]
Statue Of Liberty: బ్రెజిల్ దక్షిణ భాగంలో సోమవారం (డిసెంబర్ 15) తీవ్ర తుఫాన్ గువైబా నగరాన్ని అతలాకుతలం చేసింది. రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలోని గువైబాలో, హావన్ మెగాస్టోర్ బయట ఏర్పాటు చేసిన 24 మీటర్ల ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిరూపం బలమైన గాలుల ధాటికి కూలిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. భారీ విగ్రహం నెమ్మదిగా ముందుకు ఒరిగి ఖాళీ పార్కింగ్ స్థలంపై పడిపోతున్న […]
Upasana: మెగా కుటుంబ కోడలు, ప్రముఖ వ్యాపారవేత్త ఉపాసనకు అరుదైన గౌరవం దక్కింది. బిజినెస్ టుడే సంస్థ అందించే ‘మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డును ఉపాసన అందుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ అవార్డు తనకు లభించడం ఎంతో గర్వంగా, ఎంతో బాధ్యతను గుర్తు చేసే విషయమని ఆమె పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం గర్భవతిగా ఉన్న కారణంగా అవార్డు ప్రదాన కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరుకాలేకపోయానని ఉపాసన […]
GHMC Meeting: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో నేడు ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వార్డుల డీలిమిటేషన్‌కు సంబంధించిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను అధికారులు సభలో ప్రవేశపెట్టనున్నారు. వార్డుల విభజన విధానం, దానిపై వచ్చిన అభ్యంతరాలు ఈ సమావేశంలో ప్రధాన అంశాలుగా నిలవనున్నాయి. వార్డుల పునర్విభజనపై నగర కార్పొరేటర్లు తమ అభ్యంతరాలు, సూచనలను సభలో స్పష్టంగా తెలియజేయనున్నారు. ఏ ప్రాతిపదికన వార్డుల విభజన చేపట్టారో తెలియట్లేదని, బౌండరీస్‌కు సంబంధించిన స్పష్టమైన మ్యాప్ అందించలేదని […]
IPL 2026: ఐపీఎల్ (IPL) 2026 మినీ వేలం నేడు (డిసెంబర్ 16) అబుదాబీ వేదికగా జరగనుంది. ఈ వేలంలో మొత్తం పది ఫ్రాంచైజీలకు 77 స్లాట్లు అందుబాటులో ఉండగా, 350 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌కు అనుకూలమైన స్పెషలిస్టులు, యువ దేశీ, విదేశీ క్రికెటర్లపై జట్లు భారీగా పెట్టుబడి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వేలంలో విదేశీ ఆటగాళ్లు “హాట్ కేకుల్లా” మారే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. మరి ఆ […]
Mother Sells Own Son: నిజమాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలో చోటుచేసుకున్న బాలుడు విక్రయ ఘటన తీవ్ర కలకలం రేపింది. కన్న బిడ్డను స్వార్థం కోసం అమ్మేసిన తల్లి చర్య స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన బాలుడి తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 5వ తేదీన ఆ బాలుడి తల్లి తన కుమారుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత మహారాష్ట్రలోని పూణెకు చేరుకుని […]
CM Chandrababu: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ బిజీ షెడ్యూల్‌తో అమరావతిలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఏపీ సచివాలయానికి చేరుకోనున్న సీఎం చంద్రబాబు, అక్కడ ప్రభుత్వ పరిపాలనా అంశాలపై సమీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబుతో అమెరికా కాన్సులేట్ జనరల్ లౌరా విలియమ్స్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలు, పెట్టుబడులు, విద్యా, వాణిజ్య రంగాల్లో సహకారం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. […]
YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ విజయవాడకు రానున్నారు. భవానీపురం జోజీ నగర్‌లోని 42 ఫ్లాట్ల బాధితులను స్వయంగా కలిసి పరామర్శించేందుకు ఆయన పర్యటన ఖరారైంది. ఇటీవల తమ ఇళ్లను కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన బాధితుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు జగన్ ఈ సందర్శన చేపడుతున్నారు. పర్యటన షెడ్యూల్ ప్రకారం, వైఎస్ జగన్ ఉదయం 10 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి […]