Mother Sells Own Son: నిజమాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలో చోటుచేసుకున్న బాలుడు విక్రయ ఘటన తీవ్ర కలకలం రేపింది. కన్న బిడ్డను స్వార్థం కోసం అమ్మేసిన తల్లి చర్య స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన బాలుడి తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 5వ తేదీన ఆ బాలుడి తల్లి తన కుమారుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత మహారాష్ట్రలోని పూణెకు చేరుకుని అక్కడ బాలుడిని రూ.2.40 లక్షలకు విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో ఎల్లమ్మ గుట్టకు చెందిన ఇద్దరి మధ్య వర్తిత్వం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్… విశాఖలో మంత్రి లోకేష్ కీలక పర్యటన
బాలుడు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. వాటి ఆధారంగా బాలుడి తల్లి సహా మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై బాలుడి తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన కన్న బిడ్డనే అమ్మేసిన తల్లి చర్యను తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రస్తుతం బాలుడిని రక్షించి, భద్రతకు సంబంధించిన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
YS Jagan: భవానీపురం జోజీ నగర్ బాధితులకు పరామర్శ.. నేడు విజయవాడకు మాజీ సీఎం వైఎస్ జగన్..!