Upasana: మెగా కుటుంబ కోడలు, ప్రముఖ వ్యాపారవేత్త ఉపాసనకు అరుదైన గౌరవం దక్కింది. బిజినెస్ టుడే సంస్థ అందించే ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డును ఉపాసన అందుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ అవార్డు తనకు లభించడం ఎంతో గర్వంగా, ఎంతో బాధ్యతను గుర్తు చేసే విషయమని ఆమె పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం గర్భవతిగా ఉన్న కారణంగా అవార్డు ప్రదాన కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరుకాలేకపోయానని ఉపాసన వెల్లడించారు. ప్రయాణం చేయలేని పరిస్థితుల్లో ఉన్నందున ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ఈ గుర్తింపు తమ సంస్థకు, తమ టీమ్‌కు మరింత ప్రేరణనిస్తుందని ఆమె పేర్కొన్నారు. మానసికంగా, శారీరకంగా సానుకూల మార్పును తీసుకురావడమే తమ లక్ష్యమని, ఈ అవార్డు రోజూ మరింత మెరుగ్గా పనిచేయడానికి ప్రోత్సహిస్తుందని ఉపాసన తన పోస్ట్‌లో తెలిపారు.
GHMC Meeting: నేడు జీహెచ్ఎంసి ప్రత్యేక కౌన్సిల్ సమావేశం… వార్డుల డీలిమిటేషన్‌పై కీలక చర్చ
వ్యాపారవేత్తగా రాణిస్తూనే అపోలో హాస్పిటల్స్ గ్రూప్ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్న ఉపాసన, కుటుంబ బాధ్యతలను కూడా సమతుల్యంగా చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె గర్భవతిగా ఉండటంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న నేపథ్యంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నా, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటిలాగే యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. ఇక ఉపాసన షేర్ చేసిన అవార్డు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు, సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ “గ్రేట్.. ఇన్‌స్పిరేషన్” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా మెగా అభిమానులు మెగా కోడలికి కంగ్రాట్స్ చెబుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
IPL 2026: నేడు తేలనున్న ఆటగాళ్ల భవితవ్యం.. వేలంపాటకు సర్వం సిద్ధం..!
Receiving the Most Powerful Women in Business Award by @business_today is truly humbling 🧿 @NSEIndia
Sorry, I couldn’t make it in person, unable to travel due to my pregnancy. 🤰🏼 🥰
At @_ur_life_ , our focus has always been on creating positive change mentally & physically.… pic.twitter.com/ZrInWT93QG
— Upasana Konidela (@upasanakonidela) December 15, 2025