టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన మొక్కల యజ్ఞం ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమం నిర్విఘ్నంగా ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే సోమవారం నాడు ‘ఎనిమీ’ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన సినీ నటులు విశాల్, ఆర్య, నటి మృణాళిని రవి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హైటెక్స్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం హీరో విశాల్ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్, సీఎం కేసీఆర్ మానసపుత్రిక హరితహారం స్ఫూర్తితో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో […]
రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యువ హీరో నాగశౌర్యకు చెందిన ఓ ఫాంహౌస్‌లో 30 మంది పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబట్టారు. ఈ కేసులో నిందితులకు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితుల బెయిల్ పిటిషన్ లను కొట్టివేసింది. అయితే పోలీసుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బహిర్గతం అయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న గుత్తా సుమన్ గత కొన్నేళ్లుగా ప్రైవేట్ క్యాసినో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పలు స్టార్ హోటళ్లు, ఫామ్ హౌస్‌లలో […]
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ తన 66వ పుట్టినరోజును టర్కీ తీరంలోని సూపర్ యాచ్‌లో జరుపుకున్నారు. బిల్‌గేట్స్ తన పుట్టినరోజు పార్టీకి పిలిచిన 50 మంది అతిథుల్లో ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కూడా ఉన్నారు. ముఖ్యంగా బిల్‌గేట్స్ ఆహ్వానించిన ఈ పార్టీకి వెళ్లేందుకు బెజోస్ ప్రైవేట్ హెలికాప్టర్ వినియోగించారని డైలీ మెయిల్ ఓ కథనం ప్రచురించింది. అందుకోసం బెజోస్ 120 మైళ్ల దూరం ప్రయాణించారని అందులో పేర్కొంది. అయితే బెజోస్ ప్రయాణించిన […]
దేశంలో కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా పుంజుకుంటోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అక్టోబర్ నెలకు సంబంధించి కేంద్రం ప్రకటించిన జీఎస్టీ వసూళ్ల వివరాలను చూస్తే ఈ విషయంపై క్లారిటీ వస్తుంది. అక్టోబరులో దేశవ్యాప్తంగా రూ.1,30,127 కోట్ల జీఎస్టీ వసూళ్లు వచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రకటించారు. ఈ వసూళ్లలో సీజీఎస్టీ వసూళ్లు 23,861 కోట్లు కాగా ఎస్‌జీఎస్టీ వసూళ్లు 30,421 కోట్లు. ఐజీఎస్టీ కింద రూ.67,361 కోట్లు వచ్చాయి. […]
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని జట్ల కంటే ముందుగా దుబాయ్ చేరుకుని ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడటం ద్వారా పిచ్‌లపై అవగాహన ఉన్న టీమిండియా క్రికెటర్లు దారుణంగా ఆడుతున్నారని పలువురు క్రికెట్ విశ్లేషకులు మండిపడుతున్నారు. పటిష్టమైన పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లపై ప్రణాళిక ప్రకారం ఆడకుండా కోహ్లీ సేన భారీ మూల్యం చెల్లించుకుందని విమర్శిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి టీమిండియాకు సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారినా.. పూర్తిగా అయితే దారులు మూసుకుపోలేదు. టీమిండియా సెమీస్ చేరాలంటే […]
తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్టు-2021 ఫలితాలు సోమవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ప్రకటించారు. ఈ ఫలితాల్లో 96.99 శాతం మంది అర్హత సాధించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్టు కోసం 5,054 మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 14 కేంద్రాల్లో అక్టోబర్ 23న నిర్వహించిన ఈ పరీక్షకు 3,087 మంది అభ్యర్థులు హాజరు కాగా 2,994 మంది అర్హత సాధించారు. Read Also: తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది […]
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలతో చీఫ్ ఎలక్టోరల్ అధికారి శశాంక్ గోయల్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ప్రత్యేక ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై చర్చ జరిగింది. అనంతరం ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించారు. నవంబర్ 1, 2021న ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం తెలంగాణలో 3,08,75,744 మంది ఓటర్లున్నారు. ఈ జాబితాలో పురుషులు 1,52,57,690 మంది, మహిళలు 1,50,97,292 మంది, థర్డ్ జెండర్ 1,683 మంది, సర్వీస్ ఓటర్లు 14,501 మంది, ఎన్నారై […]
తెలంగాణలో పాదయాత్రల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే బండి సంజయ్, ఈటెల రాజేందర్ వంటి కీలక నేతలు పాదయాత్రలు చేయగా.. వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రస్తుతం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ నేతలు కూడా పాదయాత్రలు చేపట్టనున్నారు. తెలంగాణలో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా 33 జిల్లాల్లో ప్రజా చైతన్య పాదయాత్ర నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ వెల్లడించారు. ఈనెల 14 నుంచి 21 వరకు తెలంగాణ వ్యాప్తంగా 2,300 కిలోమీటర్లు మేర ప్రజాచైతన్య పాదయాత్ర […]
కరోనా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. త్వరలోనే కరోనా థర్డ్ వేవ్ విజృంభించే అవకాశాలు ఉన్నాయని కొంతమంది విశ్లేషిస్తున్నారు. మరోవైపు దేశంలోని కొన్ని రాష్ట్రాలలో నమోదవుతున్న కరోనా కేసులను చూస్తుంటే తప్పనిసరిగా మూడో వేవ్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ మూడో డోస్ కూడా తీసుకుంటే మంచిదని కొన్ని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. బూస్టర్ డోసుల వాడకంపై ఇంకా స్పష్టత రాకున్నా.. మూడో డోస్ తీసుకున్న వారిని ఇతరులతో పోల్చి చూస్తే […]
దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.114కి చేరడంతో వాహనాలలో పెట్రోల్ పోయించాలంటే మిడిల్ క్లాస్ ప్రజల జేబులు ఖాళీ అయిపోతున్నాయి. అయితే పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పెట్టిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెరిగిపోతున్న పెట్రోల్ ధరల నుంచి ప్రజలు ఉపశమనం పొందాలంటే ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని సజ్జనార్ ఆ ట్వీట్‌లో కోరారు. అంతేకాకుండా హీరో మహేష్ బాబు […]