Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
- వేసవిలో కూల్‌గా ఉంచే ఆపిల్ షర్బత్ స్పెషల్
- 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈజీ రెసిపీ
- సబ్జా గింజలు, డ్రై ఫ్రూట్స్‌తో హెల్త్ బెనిఫిట్స్
- టేస్ట్ పెంచే కిచెన్ టిప్స్ ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple Sharbat Recipe in Telugu: వేసవి కాలం మొదలైందంటే చాలు.. మన శరీరం ఎప్పుడూ చల్లని పానీయాలనే కోరుకుంటుంది. ఎప్పుడూ తాగే బాదం పాలు, నిమ్మరసం కాకుండా ఈసారి కొంచెం వెరైటీగా, హెల్తీగా ఉండే ‘ఆపిల్ షర్బత్’ (Apple Sharbat) ట్రై చేయండి. ఇది కేవలం దాహాన్ని తీర్చడమే కాకుండా, చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఇంటికి వచ్చిన అతిథులకు లేదా పిల్లలకు ఈ షర్బత్ చేసి ఇస్తే, వారు తప్పకుండా రెసిపీ అడుగుతారు. తయారు చేయడం చాలా సులభం, ఎక్కువ సమయం కూడా పట్టదు. ఆపిల్ ముక్కల క్రిస్పీనెస్, డ్రై ఫ్రూట్స్ క్రంచీనెస్‌తో కూడిన ఈ షర్బత్ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.
Also Read
- Palak Paneer Pakoda Recipe: ఇంట్లోనే సింపుల్‌గా పాలక్ పనీర్ పకోడాలు.. తయారీ విధానం ఇదిగో!
- Virat Kohli: తనను డకౌట్ చేసిన మాథ్యూ హెన్రీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన కింగ్ కోహ్లీ.. వీడియో వైరల్..
- Credit Card Rule Changes: ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్.. రూల్స్ మారుతున్నాయ్.. కొత్త ఛార్జీలు వస్తున్నాయి..!
- AP Panchayat Elections: రామాలయ నిర్మాణం కోసం గ్రామస్తుల వినూత్న నిర్ణయం.! సర్పంచ్ పదవి వేలం..
కావలసిన పదార్థాలు:
ప్రధాన పదార్థాలు: పాలు (4 కప్పులు), నీళ్లు (1 కప్పు), ఒక పెద్ద ఆపిల్.
స్వీట్నర్ & టేస్ట్ కోసం: పంచదార (7-8 టేబుల్ స్పూన్లు), కస్టర్డ్ పౌడర్ (2 టేబుల్ స్పూన్లు).
ఆరోగ్యం కోసం: నానబెట్టిన సబ్జా గింజలు (1 టేబుల్ స్పూన్).
ఫ్లేవర్ & డ్రై ఫ్రూట్స్: యాలకుల పొడి, జీడిపప్పు పలుకులు, కిస్మిస్ , ఐస్ ముక్కలు.
Tragedy : బేగంపేట్‌లో విషాదం.. పూజ చేస్తుండగా అగ్నికి ఆహుతైన రిటైర్డ్ ప్రిన్సిపాల్
తయారీ విధానం:
పాలు మరిగించడం: అడుగు మందంగా ఉన్న గిన్నెలో పాలు, నీళ్లు పోసి మరగనివ్వాలి. పైన మీగడ కట్టకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.
కస్టర్డ్ మిశ్రమం: పాలు మరుగుతున్నప్పుడు పంచదార వేసి కరిగించాలి. మరోవైపు అర కప్పు పాలలో కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలిపి, మరుగుతున్న పాలలో పోయాలి. ఇది కొంచెం చిక్కబడే వరకు (6-7 నిమిషాలు) ఉడికించి స్టవ్ ఆపేయాలి.
చల్లార్చడం: ఈ కస్టర్డ్ పాల మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. త్వరగా చల్లారాలంటే చల్లని నీరు ఉన్న గిన్నెలో ఈ పాలను ఉంచవచ్చు.
ఆపిల్ మ్యాజిక్: పాలు పూర్తిగా చల్లారిన తర్వాత, ఒక ఆపిల్‌ను తీసుకుని పెద్ద రంధ్రాలున్న తురుముతో తురుమాలి. ఈ తురుమును వెంటనే చల్లారిన పాలలో కలపాలి.
ఫినిషింగ్: చివరగా నానబెట్టిన సబ్జా గింజలు, జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి , తగినన్ని ఐస్ ముక్కలు వేసి కలిపితే ఎంతో రుచికరమైన ఆపిల్ షర్బత్ రెడీ.
ముఖ్యమైన చిట్కా:
ఆపిల్ తురుమును పాలు వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడూ వేయకూడదు. పాలు పూర్తిగా చల్లారిన తర్వాతే ఆపిల్ తురుము కలిపితేనే ఆపిల్ ముక్కలు నల్లబడకుండా, కరకరలాడుతూ రుచిగా ఉంటాయి. పైన కొంచెం రోజ్ పెటల్స్‌తో గార్నిష్ చేస్తే రెస్టారెంట్ స్టైల్ లుక్ వస్తుంది.
తాజావార్తలు
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
Palak Paneer Pakoda Recipe: ఇంట్లోనే సింపుల్‌గా పాలక్ పనీర్ పకోడాలు.. తయారీ విధానం ఇదిగో!
-
Vivo T6x 5G: Vivo T6x 5G త్వరలో భారత్‌లో లాంచ్.. BIS సర్టిఫికేషన్‌లో ప్రత్యక్షం.. 50MP కెమెరా, భారీ బ్యాటరీ
-
PM Modi: ప్రధాని మోడీ గొప్ప మనసు.. వృద్ధురాలికి స్వయంగా సాయం
-
Virat Kohli: తనను డకౌట్ చేసిన మాథ్యూ హెన్రీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన కింగ్ కోహ్లీ.. వీడియో వైరల్..
ట్రెండింగ్
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!