దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.114కి చేరడంతో వాహనాలలో పెట్రోల్ పోయించాలంటే మిడిల్ క్లాస్ ప్రజల జేబులు ఖాళీ అయిపోతున్నాయి. అయితే పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పెట్టిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెరిగిపోతున్న పెట్రోల్ ధరల నుంచి ప్రజలు ఉపశమనం పొందాలంటే ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని సజ్జనార్ ఆ ట్వీట్‌లో కోరారు. అంతేకాకుండా హీరో మహేష్ బాబు ఫోటోలతో కూడిన మీమ్‌ను ఆ ట్వీట్‌లో పోస్ట్ చేశారు.
Read Also: వైరల్: తెలివిలో అది మనిషిని మించిపోయింది
తెలంగాణలోని వివిధ ప్రాంతాల ప్రజలు తమ అవసరాల కోసం హైదరాబాద్ నగరానికి వస్తుంటారని, అలాంటి వారు నగరంలో ఎక్కడికైనా వెళ్లాలంటే ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి టీ24 టిక్కెట్ వినియోగించుకోవాలని సజ్జనార్ పిలుపునిచ్చారు. పర్యాటకులు, విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన టీ24 టిక్కెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ టిక్కెట్ ద్వారా లీటరు పెట్రోల్ కంటే తక్కువ ధరతోనే 24 గంటల పాటు ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చని సూచించారు. టీ24 టిక్కెట్‌లో రెండు రకాలు ఉన్నాయని.. ఏసీ టిక్కెట్ ధర రూ.160, మెట్రో టిక్కెట్ ధర రూ.80 అని సజ్జనార్ తెలిపారు.
Travel in #TSRTC Safely with less cost#sundayvibes @urstrulyMahesh @puvvada_ajay @Govardhan_MLA @RGVzoomin @DarshanDevaiahB @HUMTA_hmdagov @airnews_hyd @maheshbTOI @balaexpressTNIE @V6_Suresh @PranitaRavi @baraju_SuperHit @abntelugutv @AbhiramNetha @iAbhinayD @Telugu360 @TSRTCHQ pic.twitter.com/hvQVZytMNe
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) October 31, 2021