హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు 14 రౌండ్ల ఫలితాలు పూర్తిగా కేవలం రెండు రౌండ్లలో మాత్రమే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధిక్యం చూపించారు. మిగతా 12 రౌండ్లలో ఈటల రాజేందర్ స్పష్టమైన ఆధిక్యం కనపరిచారు. 14 రౌండ్ల ఫలితాలు ముగిసే సరికి ఈటల రాజేందర్ 9,434 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. Read Also: హుజురాబాద్ ఈటల కంచుకోట..? అయితే టీఆర్ఎస్ నేతల గ్రామాల్లోనూ బీజేపీ అభ్యర్థి […]
యాసంగిలో వరి విత్తనాల అమ్మకాలపై సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు విచారణ జరిపింది. వరి విత్తనాలు అమ్మకూడదని సిద్దిపేట కలెక్టర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని, దీనిపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోర్టును కోరారు. సిద్దిపేట కలెక్టర్, తెలంగాణ ప్రభుత్వం, సిద్దిపేట వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ అధికారిని ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. ఈ కేసులో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. Read Also: మరోసారి చైతన్య ఇంటికి సమంత..? […]
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. జగన్ తీరును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇదంతా బద్వేలులో వైసీపీ విజయం సాధించినందుకు అనుకుంటున్నారా? కాదండి. నవంబర్ 1న వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవం సందర్భంగా సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జగన్ చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Read Also: బీరువాలో లక్షదాచిన వృద్ధుడు… ఆ తర్వాత ఏమైంది? ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు […]
ఏడాదిన్నర కాలంగా కరోనా వైరస్ కాటుతో ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. చైనాలో పుట్టి ప్రపంచమంతా వ్యాప్తి చెందిన కరోనా వైరస్ వల్ల ఇప్పటివరకు 50 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మరణాల సంఖ్య నవంబర్ 1వ తేదీ నాటికి 50.01 లక్షలకు చేరింది. కరోనా వైరస్ ధాటికి ముఖ్యంగా అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్, బ్రెజిల్ దేశాల ప్రజలు అల్లాడిపోయారు. ప్రపంచంలోని […]
దేశంలో వంటనూనెల ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు నూనెతో వంట చేసుకోవాలంటే అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమల సంఘం సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈఏ) సామాన్యులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. దీపావళి పండగ నేపథ్యంలో హోల్‌సేల్‌గా విక్రయించే లీటరు నూనెను రూ.3 నుంచి రూ.5 వరకు తగ్గించే విధంగా చర్యలు చేపట్టినట్లు వివరించింది. నూనెల పరిశ్రమ ఇబ్బందుల్లో ఉన్నా పండగ దృష్ట్యా వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. Read […]
ఢిల్లీలో టీడీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. సోమవారం సాయంత్రం లోక్‌సభ టీడీపీ ఎంపీ కేశినేని నాని, రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి వైఎస్ఆర్‌సీపీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై అధికార పార్టీ వైసీపీ దాడులు చేయిస్తోందని, బూతులు తిట్టిస్తోందని ఎన్నికల సంఘం అధికారులకు టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. Read Also: ఏపీలో […]
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా షార్జా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఓపెనర్ జాస్ బట్లర్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలుత శ్రీలంక జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆరంభంలో శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగింది. బట్లర్ (67 బంతుల్లో 101 నాటౌట్) మినహా జాసన్ రాయ్ (9), మలాన్ (6), బెయిర్ స్టో (0) విఫలం కావడంతో ఇంగ్లండ్ జట్టు ఆచితూచి బ్యాటింగ్ చేసింది. […]
పోలీసులకు భయపడి ఓ వ్యక్తి పారిపోతూ బావిలో పడి మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… జమ్మికుంటకు చెందిన పొనుగంటి వేణు అనే యువకుడు ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఆదివారం సెలవు దినం కావడంతో సరాదాగా స్నేహితులతో గడపాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు వేణు తన స్నేహితులతో కలిసి హుజురాబాద్ రోడ్డులోని ఓ బారు సమీపంలో ఆదివారం రాత్రి సమయంలో మద్యం సేవిస్తున్నాడు. అయితే […]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,326 శాంపిళ్లను పరీక్షించగా 160 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మరణించారు. తాజా కేసులతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,71,623కి చేరగా… మరణాల సంఖ్య 3,958కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 193 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కోవిడ్ బారిన పడి ఇప్పటివరకు 6.63 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 3,974 కరోనా కేసులు యాక్టివ్‌గా […]
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల ముసాయిదాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్ 1న ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం ఏపీలో మొత్తం 4.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1.99 కోట్ల మంది, మహిళలు 2.4 కోట్ల మంది ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 4,041 మంది ట్రాన్స్ జెండర్లు, 67,090 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. అయితే ఏపీలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటం విశేషం. ఏపీ వ్యాప్తంగా […]