తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్టు-2021 ఫలితాలు సోమవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ప్రకటించారు. ఈ ఫలితాల్లో 96.99 శాతం మంది అర్హత సాధించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్టు కోసం 5,054 మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 14 కేంద్రాల్లో అక్టోబర్ 23న నిర్వహించిన ఈ పరీక్షకు 3,087 మంది అభ్యర్థులు హాజరు కాగా 2,994 మంది అర్హత సాధించారు.
Read Also: తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే..?
ఈ ఫలితాల్లో బీపెడ్‌లో ఖమ్మం విద్యార్థిని అంగోతు కృష్ణవేణి మొదటి ర్యాంక్ సాధించగా… బడే రమేష్ రెండో ర్యాంక్ సాధించాడు. డీపెడ్‌లో భూపాలపల్లి విద్యార్థి గాజుల సృజన్ మొదటి ర్యాంక్ సాధించగా.. తుంగ అనూష రెండో ర్యాంక్ సాధించింది. బీపెడ్‌లో టాప్-10లో ఏడుగురు మహిళలు ఉండగా.. డీపెడ్‌లో ఆరుగురు మహిళలు ర్యాంకులు సాధించారు. కాగా డీపీఈడీకి 1,207 మంది అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు.