Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
- జలుబు, జ్వరానికి మిర్యాల చారు – నేచురల్ మందు
- కేవలం 5 నిమిషాల్లో రెడీ అయ్యే స్పెషల్ రెసిపీ
- జీర్ణక్రియకు మిర్యాల చారు ఎందుకు మంచిది?
- రుచి పెంచే కీలక టిప్స్ ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Miriyala Charu Recipe in Telugu: ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నూతన సంవత్సర వేడుకలను విభిన్న పద్ధతుల్లో జరుపుకుంటారు. చలికాలంలో గొంతు నొప్పిగా ఉన్నా, జలుబు చేసినా లేదా నోటికి ఏదైనా ఘాటుగా తినాలనిపించినా అందరికీ గుర్తొచ్చేది మిర్యాల చారు. ఈ చారు కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. విస్మయ్ ఫుడ్స్ వారి ఈ స్పెషల్ రెసిపీతో చారు పెడితే, ఇక కూరలతో పని లేకుండా అన్నమంతా ఈ చారుతోనే లాగించేస్తారు.
Also Read
- Rahul Gandhi: అమిత్ షాను వెంటనే తొలగించండి.. ప్రధానికి రాహుల్ సలహా..
- AP Job Calendar 2026: ఏపీ జాబ్ క్యాలెండర్.. ఈసారి 10,660 ఉద్యోగాలు భర్తీ.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు..
- Telangana Police Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల..
- Sonu Sood: విద్యార్థుల నిరసనపై కంగనా వ్యాఖ్యలు సిగ్గుచేటు.. సోనూ సూద్ ఘాటు స్పందన
కావలసిన పదార్థాలు:
- మసాలా కోసం: మిర్యాలు (1 టేబుల్ స్పూన్), జీలకర్ర (1 టేబుల్ స్పూన్), , 10-12 వెల్లుల్లి రెబ్బలు.
- తాలింపు కోసం: నూనె (1 టేబుల్ స్పూన్), ఆవాలు (1 టీస్పూన్), పసుపు (1/4 టీస్పూన్), , 3 ఎండుమిర్చి.
- ప్రధాన పదార్థాలు: ఒక పెద్ద పండు టమోటా, సుమారు 600 మి.లీ చింతపండు రసం, , 1/4 టీస్పూన్ ఇంగువ.
- సువాసన కోసం: తగినంత కరివేపాకు, కొత్తిమీర , రుచికి సరిపడా ఉప్పు.
తయారీ విధానం:
మసాలా తయారీ: కేవలం ఐదు నిమిషాల్లో ఈ చారును సిద్ధం చేసుకోవచ్చు. ముందుగా రోట్లో మిర్యాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మిక్సీ కంటే ఇలా దంచితేనే చారుకు అసలైన రుచి వస్తుంది.
తాలింపు: ఒక పాత్రలో నూనె వేడి చేసి, ఆవాలు, పసుపు, ఎండుమిర్చి వేసి వేయించాలి.
టమోటాలు: తాలింపు వేగాక టమోటా ముక్కలు , కొద్దిగా ఉప్పు వేసి, అవి మెత్తగా గుజ్జులా అయ్యే వరకు ఉడికించాలి.
మరిగించడం: టమోటాలు ఉడికాక అందులో చింతపండు రసం, మనం దంచి పెట్టుకున్న మిర్యాల మిశ్రమం వేసి బాగా కలపాలి.
ఫినిషింగ్: చివరిగా కరివేపాకు రెబ్బలు, కొత్తిమీర తరుగు , ఇంగువ వేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక పొంగు వచ్చే వరకు మరిగించి స్టవ్ ఆపేయాలి.
కీలకమైన టిప్స్:
ఈ చారు మరింత రుచిగా రావాలంటే కరివేపాకు , కొత్తిమీరను కాడలతో సహా వేయడం మంచిది. ఇది చారుకు అదనపు సువాసనను ఇస్తుంది. జ్వరం వచ్చినప్పుడు లేదా త్వరగా ఏదైనా వంట చేయాలనుకున్నప్పుడు ఈ మిర్యాల చారు ఒక అద్భుతమైన ఎంపిక.
తాజావార్తలు
-
Rahul Gandhi: అమిత్ షాను వెంటనే తొలగించండి.. ప్రధానికి రాహుల్ సలహా..
-
AP Job Calendar 2026: ఏపీ జాబ్ క్యాలెండర్.. ఈసారి 10,660 ఉద్యోగాలు భర్తీ.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు..
-
Telangana Police Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల..
-
Bhagyashri Borse: ‘ఆ విషయం చెబితే మా అమ్మ నన్ను వాట్సాప్లో బ్లాక్ చేసింది.. 6 నెలలు మాట్లాడలేదు’..
-
Sonu Sood: విద్యార్థుల నిరసనపై కంగనా వ్యాఖ్యలు సిగ్గుచేటు.. సోనూ సూద్ ఘాటు స్పందన
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!