బిల్‌గేట్స్, జెఫ్ బెజోస్‌పై ట్రోలింగ్స్… ఇచ్చి పడేస్తున్న నెటిజన్‌లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ తన 66వ పుట్టినరోజును టర్కీ తీరంలోని సూపర్ యాచ్‌లో జరుపుకున్నారు. బిల్‌గేట్స్ తన పుట్టినరోజు పార్టీకి పిలిచిన 50 మంది అతిథుల్లో ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కూడా ఉన్నారు. ముఖ్యంగా బిల్‌గేట్స్ ఆహ్వానించిన ఈ పార్టీకి వెళ్లేందుకు బెజోస్ ప్రైవేట్ హెలికాప్టర్ వినియోగించారని డైలీ మెయిల్ ఓ కథనం ప్రచురించింది. అందుకోసం బెజోస్ 120 మైళ్ల దూరం ప్రయాణించారని అందులో పేర్కొంది. అయితే బెజోస్ ప్రయాణించిన హెలికాప్టర్ భారీస్థాయిలో కార్బన్ ఉద్గారాలను గాలిలో విడుదల చేసినట్లు సదరు కథనంలో ఆరోపించింది. దాదాపుగా బెజోస్ ప్రయాణించిన హెలికాప్టర్ 215 పౌండ్ల కార్బన్ డై ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేసినట్లు వివరించింది. ఓ విలాసవంతమైన పార్టీ కోసం బెజోస్ వాతావరణ కాలుష్యానికి కారణమయ్యాడని తీవ్ర విమర్శలు చేసింది.
Also Read
- Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
- World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
దీంతో సోషల్ మీడియాలో బిల్‌గేట్స్, బెజోస్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తూ వారిని ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే నెటిజన్‌ల ఆగ్రహానికి కూడా కారణముంది. ఇటీవల వాతావరణంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న బిల్‌గేట్స్, బెజోస్ వాతావరణ పరిరక్షణకు సంబంధించి పలు కీలకమైన అంశాలను మాట్లాడారు. ప్రపంచ దేశాలు వాతావరణాన్ని కాపాడాల్సిన ఆవశ్యకతను వివరించారు. దీంతో బెజోస్ లాంటి కపటవాదులు ఒకవైపు సూక్తులు మాట్లాడుతూ.. మరోవైపు కార్బన ఉద్గారాలకు కారణమవుతున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. నాలుగు గంటలు జరిగే బిల్‌గేట్స్ బర్త్ డే పార్టీ కోసం భారీ స్థాయిలో ప్రైవేట్ హెలికాప్టర్లు వినియోగించారని.. వాటి బదులు బస్సులు వినియోగించి ఉంటే విలువను కాపాడుకునేవారని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
తాజావార్తలు
-
Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ కెరీర్ను టీమిండియా నాశనం చేస్తోంది.. అభిషేక్ శర్మను పక్కనపెట్టేయండి!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
-
Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్‌లో ఉందంటే..!
ట్రెండింగ్
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!