హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ ఘనవిజయం సాధించారు. ఈ గెలుపుతో అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేల సంఖ్య 3కి చేరిందని కమలం పార్టీ నేతలు పొంగిపోతున్నారు. అయితే నిజంగా హుజురాబాద్‌లో బీజేపీ గెలిచిందా అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. సాంకేతికంగా మాత్రమే బీజేపీది గెలుపుగా భావించాలి. దీనికి కారణం ఈటల రాజేందర్. నిజానికి ఈ ఉప ఎన్నిక రాజకీయ పార్టీల మధ్య జరగలేదు. కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్‌గానే సాగింది. అందుకే ఈ గెలుపును చూసి బీజేపీ […]
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా పరాజయం పాలు అవుతుండటంతో అభిమానుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అభిమానులు అయితే హద్దు మీరి విమర్శలు చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కుమార్తె వామికను అత్యాచారం చేస్తామని బెదిరించారు. ఈ విషయంలో విరాట్ కోహ్లీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మద్దతుగా నిలిచారు. ‘డియర్ విరాట్.. కొంతమంది మనుషులు పూర్తిగా ద్వేషంతో నిండిపోయి ఉంటారు. ఎందుకంటే వారికి ఎవ్వరూ ప్రేమను పంచరు. వాళ్లను క్షమించు. జట్టును రక్షించుకో’ అంటూ […]
బద్వేల్ ఉప ఎన్నికలో అధికార పార్టీ వైసీపీ ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. బద్వేల్ ఉప ఎన్నికలో చారిత్రక విజయాన్ని అందించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఎన్నిక తమ బాధ్యతను మరింత పెంచుతోందని సజ్జల వ్యాఖ్యానించారు. ఓడితే సమీక్షించుకోవడానికి, గెలిస్తే మరింత బాధ్యతగా పనిచేయడానికి స్ఫూర్తిని ఇస్తుందని సజ్జల తెలిపారు. Read Also: సీఎం జగన్ రికార్డును బద్దలు కొట్టిన మహిళ మరోవైపు ప్రధాన […]
ఏపీలో జరిగిన బద్వేల్ ఉప ఎన్నిక ద్వారా వైసీపీ అభ్యర్థి డా.సుధ ఏకంగా సీఎం జగన్ రికార్డునే అధిగమించారు. బద్వేల్ ఉప ఎన్నికలో ఆమె రికార్డు మెజారిటీతో ఘనవిజయం సాధించారు. 2019 ఎన్నికల్లో కడప జిల్లా పులివెందుల నుంచి పోటీ చేసిన జగన్ టీడీపీ అభ్యర్థి సతీష్ కుమార్ రెడ్డిపై 90,110 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం పోలైన 1,80,127 ఓట్లలో జగన్మోహన్ రెడ్డికి 1,32,356 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లో జగన్‌కు 75,243 ఓట్ల మెజార్టీ […]
మెగా హీరో సాయిధరమ్‌తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన తర్వాత విడుదలైన సినిమా ‘రిపబ్లిక్’. దీంతో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఈ మూవీ కోసం మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రమోషన్‌లు నిర్వహించారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపించలేదు. Read Also: 1000వ ఎపిసోడ్‌కు చేరుకోనున్న జీ తెలుగు సీరియల్ అయితే అక్టోబర్ 1న థియేటర్లలో […]
రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘RRR’ మూవీకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా అభిమానులు ఈ మూవీ కోసం వేచి చూస్తున్నారు. అయితే ఇప్పుడు రాజమౌళి ‘RRR’ కాకుండా బీజేపీ ‘RRR’కు సంబంధించిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ తరఫున ప్రస్తుతం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన రాజాసింగ్, గత ఏడాది దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచిన రఘునందన్‌రావు […]
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో ఆయన మాట్లాడారు. ఈటల రాజేందర్ 30వేల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ పార్టీ రూ.5వేల కోట్లను ఖర్చు చేసిందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. హుజురాబాద్ ఫలితం టీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదన్నారు. హుజురాబాద్ ప్రజలు అదిరిపోయే తీర్పు ఇచ్చారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. Read Also: టీఆర్ఎస్ నేతల గ్రామాల్లోనూ ఈటల హవా […]
మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యువరాజ్ సింగ్ అంటే నాట్ వెస్ట్ ట్రోఫీ ఫైనల్, 2007 ప్రపంచకప్‌లో ఆరు సిక్సర్లు గుర్తుకురాక మానవు. ఆయా మ్యాచ్‌లలో యువీ అంతటి గొప్ప ముద్ర వేశాడు. అయితే మంగళవారం నాడు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. అభిమానుల కోరిక మేరకు మళ్లీ తనను మైదానంలో చూస్తారని హింట్ ఇచ్చాడు. 2019లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ మళ్లీ తనను ఫీల్డ్‌లో చూస్తారని […]
సాధారణంగా ప్రేక్షకులు ఒక సీరియల్‌ను సుదీర్ఘకాలం పాటు ఇష్టపడాలంటే బలమైన కథ ఉండాలి, మనసుని హత్తుకునే పాత్రలుండాలి. ఆ పాత్రలలో ఇమిడిపోయే నటీనటులుండాలి, ఉత్కంటగా సాగిపోయే సన్నివేశాలుండాలి. ఈ లక్షణాలన్నింటిని పుణికిపుచ్చుకుని జీ తెలుగు మధ్యానపు సీరియళ్ల చరిత్రలోనే ఒక సంచలన ప్రయాణాన్ని సాగిస్తున్న ధారావాహిక ‘గుండమ్మ కథ’. ఈ సీరియర్ నవంబర్ 4వ తేదీ నాటికి 1000 ఎపిసోడ్స్‌ను పూర్తి చేసుకోనుంది. మరోవైపు అందరూ ఎంతో ఆసక్తికరంగా వేచిచూస్తున్న కథనం వైపు గుండమ్మ కథ అడుగులు […]