టీమిండియా సెమీస్ చేరాలంటే.. ఈ అద్భుతం జరగాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని జట్ల కంటే ముందుగా దుబాయ్ చేరుకుని ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడటం ద్వారా పిచ్‌లపై అవగాహన ఉన్న టీమిండియా క్రికెటర్లు దారుణంగా ఆడుతున్నారని పలువురు క్రికెట్ విశ్లేషకులు మండిపడుతున్నారు. పటిష్టమైన పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లపై ప్రణాళిక ప్రకారం ఆడకుండా కోహ్లీ సేన భారీ మూల్యం చెల్లించుకుందని విమర్శిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి టీమిండియాకు సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారినా.. పూర్తిగా అయితే దారులు మూసుకుపోలేదు. టీమిండియా సెమీస్ చేరాలంటే ఓ అద్భుతం జరిగి తీరాలి.
Read Also: భారత ఆటగాళ్లకు మానసిక ధైర్యం లేదు : గంభీర్
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లతో పాటు అప్ఘనిస్తాన్, నమీబియా, స్కాట్లాండ్ ఉన్నాయి. భారత్ తొలి రెండు మ్యాచ్‌లను పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లతో ఆడి ఓటమి పాలైంది. మిగతా మూడు మ్యాచ్‌లలో పసికూనలతో తలపడాల్సి ఉంటుంది. వీటిలో భారత్ విజయం సాధించడం సులభమే. అయితే న్యూజిలాండ్ కూడా ఈ మూడు జట్లపైనే ఇంకా ఆడాల్సి ఉంది. పాకిస్థాన్‌కు దాదాపుగా సెమీస్ బెర్త్ ఖరారైనట్లే. ఈ గ్రూప్ నుంచి సెమీస్ చేరనున్న రెండో జట్టు భవితవ్యమే తేలాల్సి ఉంది. న్యూజిలాండ్ ఇప్పటికే భారత్‌పై గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉంది. కానీ టీమిండియా సెమీస్‌కు చేరాలంటే పసికూనలపై ఆడాల్సి ఉన్న మూడు మ్యాచ్‌లలో న్యూజిలాండ్ ఒక మ్యాచ్‌లో తప్పనిసరిగా ఓడిపోవాలి. అంతేకాకుండా పసికూనలపై భారత్ భారీ తేడాతో విజయం సాధించాలి. అప్పుడు మాత్రమే టీమిండియా సెమీస్ చేరగలదు.
ఇప్పటికైతే భారత్ అభిమానుల ఆశలన్నీ న్యూజిలాండ్-ఆప్ఘనిస్తాన్ మ్యాచ్‌పైనే. ఈ మ్యాచ్ నవంబర్ 7న జరగుతుంది. అయితే అంతకంటే ముందే ఆప్ఘనిస్తాన్‌తో ఈనెల 3న భారత్ తలపడనుంది. కాగా మన ఆటగాళ్లలో సత్తా లేనప్పుడు ఇతరులు ఓడిపోవాలని కోరుకోవడం అత్యాశే అవుతుందని పలువురు భావిస్తున్నారు. అయితే మనిషి నైజం ఆశించడమే కాబట్టి న్యూజిలాండ్‌పై ఆఫ్ఘనిస్తాన్ గెలవాలని కోరుకోవడంలో తప్పు లేదని మరికొందరు వాదిస్తున్నారు. చూడాలి టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ప్రయాణం ఎక్కడి వరకు వెళ్తుందో?
తాజావార్తలు
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!