మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి నేటితో ఐదేళ్లు పూర్తయ్యాయి. నల్లధనం కట్టడి చేయడం కోసం అంటూ 2016, నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్ల రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రూ.500, రూ.2వేలు, రూ.100, రూ.200, రూ.50, రూ.20, రూ.10 నోట్లను తీసుకువచ్చింది. కానీ ఐదేళ్లు గడిచినా నల్లధనం వెనక్కి తీసుకురావడంలో మోదీ సర్కార్ దారుణంగా విఫలమైంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు, నెటిజన్లు మోదీ సర్కార్ వైఫల్యంపై […]
టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీస్‌కు వెళ్లకుండానే నిష్క్రమించనుంది. సోమవారం నామమాత్రంగా జరగనున్న మ్యాచ్‌లో నమీబియాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచినా.. ఓడినా ఎలాంటి ప్రయోజనం లేదు. అయితే ఈ ప్రపంచకప్‌లో భారత్ పరాజయాలకు టాస్ కారణమన్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ వ్యాఖ్యలను మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఖండించాడు. భారత్ ఓటములకు టాస్ ఎంత మాత్రం కారణం కాదన్నారు. మన బ్యాట్స్‌మెన్ వైఫల్యంతోనే జట్టు వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిందన్నాడు. పాకిస్థాన్, న్యూజిలాండ్ […]
ప్రముఖ కమెడియన్, సినీ నిర్మాత బండ్ల గణేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘డేగల బాబ్జీ’ మూవీ ట్రైలర్‌ను సోమవారం ఉదయం దర్శకుడు పూరీ జగన్నాథ్ విడుదల చేశాడు. యష్ రిషి ఫిలింస్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమాకు వెంకట్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంలో పార్తీబన్ హీరోగా నటించిన ‘ఒత్తుసెరుప్పు సైజ్ 7’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ ట్రైలర్‌లో ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకెళ్లిన ‘డేగల బాబ్జీ’ పాత్రలో బండ్ల […]
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి లేవనెత్తారు. ఇదే అంశంపై ఇటీవల ఆయన విశాఖలో బహిరంగ సభ నిర్వహించగా.. ఈరోజు విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు పోరాటంలో పాల్గొన్న ఉద్యమకారులు, పోలీస్ కాల్పుల్లో అమరులైన వారి పేర్లను ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఉద్యమం సమయంలో ఏం జరిగిందో ఆనాటి కొన్ని దినపత్రికలు ప్రచురించిన ఆర్టికల్స్‌ను కూడా పవన్ షేర్ చేశారు. విశాఖ ఉక్కు కోసం ఉద్యమించిన […]
ఈరోజు యావత్ భారతం అప్ఘనిస్తాన్ వైపు నిలబడనుంది. ఎందుకంటే టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీస్ అవకాశాలు ఆ జట్టు చేతిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అప్ఘనిస్తాన్ జట్టుపై భారత ఆటగాళ్లు, పలువురు నెటిజన్లు తెగ మీమ్స్ షేర్ చేస్తున్నారు. టాలీవుడ్ సినిమాల్లోని ఫైట్ సీన్‌లకు డైలాగులు జోడిస్తూ సెటైర్లు వేస్తున్నారు. ఈ మీమ్స్‌లో రషీద్ ఖాన్‌పై చేసిన మీమ్ తెగ ఆకట్టుకుంటోంది. ధోనీ, కోహ్లీ, రోహిత్ కలిసి రషీద్ ఖాన్ జుట్టు దువ్వుతున్న ఫోటో ఫన్నీగా ఉంది.
మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. శనిగపురం గ్రామంలో ఒకే ఇంట్లో ముగ్గురిని పాము కాటేసిన ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలను కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. క్రాంతి-మమత దంపతులకు మూడు నెలల చిన్నారి పాప ఉంది. పాపకు ఒంట్లో బాగోలేకపోవడంతో ఇటీవల తల్లిదండ్రులు తమ చిన్నారిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పూర్తిగా కోలుకున్న తర్వాత శనివారం నాడు పాపను ఇంటికి తీసుకువచ్చారు. Read Also: స్టేజిపైనే లవర్ కు ప్రపోజ్ చేసిన హీరో […]
టీ20 ప్రపంచకప్‌లో ప్రస్తుతం టీమిండియా ఆశలన్నీ అప్ఘనిస్తాన్ చేతుల్లోనే ఉన్నాయి. ఎందుకంటే ఆదివారం న్యూజిలాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో అప్ఘనిస్తాన్ గెలిస్తేనే భారత్ సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి. లేకపోతే సోమవారం నాటి నమీబియా-భారత్ మ్యాచ్ నామమాత్రంగా మారుతుంది. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో నలుగురు అఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు రాణించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. Read Also: నేడే న్యూజిలాండ్‌తో అఫ్గానిస్తాన్ మ్యాచ్..భారత్ కు అగ్ని పరీక్ష ! అప్ఘనిస్తాన్ జట్టుకు రషీద్ ఖాన్, ముజీబుర్ రెహ్మాన్, మహ్మద్ […]
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి యూత్‌లో బాగా ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆయన ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా యువ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరవుతూ ఉంటారు. ఈనెల 8న (సోమవారం) టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన తన అభిమానుల కోసం ఓ ప్రకటన విడుదల చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా తిరుమలలోని వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నానని, అందువల్ల తాను కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, అభిమానులకు అందుబాటులో ఉండటం లేదని.. ఈ విషయాన్ని […]
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు కానుకగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ సినిమా నుంచి టైటిట్ సాంగ్‌ను నటుడు రానా దగ్గుబాటి చేతుల మీదుగా ఆదివారం ఉదయం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటకు సాహిత్యం త్రివిక్రమ్ అందించగా… అరుణ్ కౌండిన్య ఆలపించాడు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించాడు. సాగర్.కె.చంద్ర దర్శకత్వం అందిస్తున్న ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. మలయాళం మూవీ ‘అయ్యప్పన్ కోషియుమ్’ […]
సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో రూ.100, రూ.500 ఇస్తే కండక్టర్ టిక్కెట్ డబ్బులు పోను చిల్లర తర్వాత ఇస్తానని టిక్కెట్ మీద రాసిస్తుంటాడు. కానీ కొంతమంది బస్సు దిగే హడావిడిలో చిల్లర సంగతి మరిచిపోతుంటారు. హైదరాబాద్ నగరంలో ఓ విద్యార్థి కూడా ఇలాగే చిల్లర తీసుకోవడం మరిచిపోయాడు. అయితే ఓ ట్వీట్ ద్వారా ఆ డబ్బులను వెనక్కి పొందడం విశేషం. వివరాల్లోకి వెళ్తే… ఈనెల 4వ తేదీ గురువారం నాడు సీతాఫల్‌మండికి చెందిన బాలరాజు అనే విద్యార్థి బాలానగర్ […]