నలుగురు అఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ల చేతుల్లో టీమిండియా భవితవ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్‌లో ప్రస్తుతం టీమిండియా ఆశలన్నీ అప్ఘనిస్తాన్ చేతుల్లోనే ఉన్నాయి. ఎందుకంటే ఆదివారం న్యూజిలాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో అప్ఘనిస్తాన్ గెలిస్తేనే భారత్ సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి. లేకపోతే సోమవారం నాటి నమీబియా-భారత్ మ్యాచ్ నామమాత్రంగా మారుతుంది. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో నలుగురు అఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు రాణించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
Read Also: నేడే న్యూజిలాండ్‌తో అఫ్గానిస్తాన్ మ్యాచ్..భారత్ కు అగ్ని పరీక్ష !
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
- India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
- Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
అప్ఘనిస్తాన్ జట్టుకు రషీద్ ఖాన్, ముజీబుర్ రెహ్మాన్, మహ్మద్ నబీ, హజ్రతుల్లా జజాయ్ కీలకమైన ఆటగాళ్లు. ఈ నలుగురు ఆటగాళ్లను అప్ఘనిస్తాన్ జట్టు ఈరోజు తుదిజట్టులో ఆడించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరిలో రషీద్ ఖాన్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ జట్టుకు ఆడుతున్నాడు. ఆ జట్టు కెప్టెన్ విలియమ్సన్ న్యూజిలాండ్ జట్టుకు కూడా సారథి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో రషీద్ ఖాన్‌కు అతడిపై అవగాహన ఉంటుందని.. టీ20 క్రికెట్‌లో రషీద్‌కు ఉన్న అనుభవంతో ఈ మ్యాచ్‌లో రాణించాలని టీమిండియా అభిమానులు ఆశిస్తున్నారు.
మరోవైపు ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ కూడా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ జట్టుకే ఆడుతున్నాడు. 308 టీ20లు ఆడిన నబీ 293 వికెట్లు, 4,801 పరుగులు చేశాడు. కివీస్‌తో మ్యాచ్‌లో అతడు కూడా సత్తా చాటాలి. అటు యువ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ దూకుడుగా ఆడతాడు. ఈ టోర్నీలో మంచి ఫామ్‌లో ఉన్న కివీస్ బౌలర్లను కాచుకుని అతడు మంచి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. కాగా ముజీబుర్ రెహ్మాన్‌కు ఫిట్‌నెస్ సమస్యలు ఉండటంతో అతడు తుదిజట్టులో ఆడతాడో లేదో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!