బీసీ సంఘాల అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు కొంతమంది గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దీంతో ఈ విషయంపై హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డికి ఆర్.కృష్ణయ్య ఫిర్యాదు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు మద్దతు ఇచ్చిన నాటి నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. తన ఫోన్ నంబర్‌ను సోషల్ మీడియాలో పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు. […]
టెక్నాలజీ మనుషులకు సుఖాలతో పాటు కష్టాలను కూడా తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా కొందరు టెక్నాలజీని ఉపయోగించి దారుణాలకు పాల్పడుతున్నారు. మొబైళ్ల ద్వారా వీడియో షూట్‌లు చేసి బెదిరింపులకు పాల్పడటం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వంటివి చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ నగరంలో జరిగింది. జూబ్లీహిల్స్‌లోని హెచ్అండ్ఎం బట్టల షోరూంలో దారుణం చోటు చేసుకుంది. Read Also: వీళ్లు మనుషులేనా? బాలికపై అత్యాచారం చేసిన తండ్రీకొడుకులు ట్రయల్ రూమ్‌లో ఓ యువతి బట్టలు మార్చుకుంటుండగా పక్క ట్రయల్ […]
తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న ఆర్టీసీని, అప్పుల్లో కూరుకుపోయిన డిస్కంలను ఆదుకునేందుకు ప్రజలపై భారం మోపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బ్యాంకులు తీసుకున్న అప్పులను ఆర్టీసీ తీర్చలేక అష్టకష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలో ఛార్జీలు పెంచుకునేందుకు ఈ రెండు సంస్థలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చేవారంలో ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రకటన చేసే అవకాశం ఉంది. Read Also: […]
హర్యానాలోని పానిపట్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న ఓ బాలికపై పొరుగింట్లో ఉంటున్న తండ్రీకొడుకులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే… పానిపట్‌లోని మోడల్ కాలనీలో నివసిస్తున్న బాలిక ఇంటి పక్కనే అజయ్ అనే యువకుడి ఇల్లు ఉంది. దీంతో అజయ్ తరచూ బాలికను ప్రేమిస్తున్నాని వెంటపడుతున్నాడు. కొన్నాళ్లకు అతడి మాయమాటలను నమ్మిన బాలిక అజయ్‌తో ప్రేమలో పడింది. ఈ నేపథ్యంలో ఓ రోజు అజయ్ బాలికను తన ఇంటికి […]
దేశంలో సామాన్యులకు పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్న వేళ.. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో వినియోగదారులకు తాత్కాలికంగా స్వల్ప ఉపశమనం కలిగింది. అయితే భవిష్యత్‌లో పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతాయని ఇంధన నిపుణుడు నరేంద్ర తనేజా వెల్లడించారు. 2023 నాటికి లీటర్ పెట్రోల్ ధర మరో రూ.100 పెరగవచ్చని ఆయన అంచనా వేశారు. చమురు అనేది విదేశాల నుంచి దిగుమతి చేసుకునేదని… దాని ధరలను నియంత్రించడం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉండదని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో […]
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా పరిస్థితి అయోమయంగా మారింది. భారత్ సెమీఫైనల్ చేరాలంటే న్యూజిలాండ్ జట్టు పసికూనల చేతిలో ఓ మ్యాచ్‌లో ఓడిపోవాలని టీమిండియా అభిమానులు కోరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే పాకిస్థాన్ మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మాత్రం టీమిండియా ఫైనల్‌కు రావాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఎందుకంటే అక్కడ మరోసారి భారత్‌ను ఓడించాలని భావిస్తున్నామని, దాని కోసం తమకు మరో మౌకా (అవకాశం) ఇవ్వాలని ఆకాంక్షించాడు. ఇప్పుడు ‘మౌకా’ అనే పదం ఎంతమాత్రం […]
ఏపీలో గతంలో పెండింగ్‌లో ఉన్న మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్‌ల గడువు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. శుక్రవారం చివరి రోజు కావడంతో నామినేషన్‌లు భారీగా దాఖలు కానున్నాయి. గురువారం అమావాస్య కావడంతో పెద్దగా నామినేషన్లు దాఖలు కాలేదని తెలుస్తోంది. దీంతో శుక్రవారం నాటి పరిస్థితిని ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమీక్షిస్తోంది. ప్రతి రెండుల గంటలకోసారి ఎస్ఈసీ అధికారులు నివేదిక తెప్పించుకుంటున్నారు. అయితే ఈ దఫా ఎన్నికల్లోనే కాకుండా నామినేషన్‌ల పర్వంలోనూ అక్రమాలు […]
ఈనెల 14న తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరవుతారు. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయంతో పాటు కేంద్ర, రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని పలు కీలకమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం […]
దీపావళి సందర్భంగా ఓటీటీలలో పలు కొత్త సినిమాలు దండయాత్ర చేస్తున్నాయి. దీపావళి కానుకగా జీ5 వేదికగా సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’, డిస్నీ హాట్‌స్టార్ వేదికగా సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’, అమెజాన్ ప్రైమ్ వేదికగా సూర్య ‘జై భీమ్’ (డైరెక్ట్ ఓటీటీ రిలీజ్) సినిమాలు సందడి చేస్తున్నాయి. వీటితో పాటు ఇటీవల సూపర్ హిట్ అయిన వరుణ్ డాక్టర్ సినిమా కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. Read Also: సూపర్‌స్టార్‌కు దీపావళి గిఫ్టులు పంపిన […]
తెలంగాణ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె పాదయాత్ర నల్గొండ జిల్లా చింతపల్లి సమీపంలో కొనసాగుతోంది. అయితే గురువారం చింతపల్లి మండలం క్రిష్టారాయపల్లిలో వైఎస్ షర్మిల బస చేస్తున్న క్యాంప్ సమీపంలో ఓ రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం వైఎస్ షర్మిలకు తెలియడంతో ఆమె వెంటనే స్పందించి 108 వాహనానికి ఫోన్ […]