ఢిల్లీలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమావేశమయ్యారు. అంతకుముందు ఇద్దరు సహాయమంత్రులను కూడా బుగ్గన కలిశారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన ఓ కాంట్రాక్ట్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌లో ఉందని.. లండన్‌లో మొదటి దఫా ఆర్బిట్రేషన్ జరిగిందని… ఇప్పుడు రెండో దఫా జరగాల్సి ఉందన్నారు. న్యాయపరమైన అంశాలు కాబట్టి వీటిలో జాప్యం జరుగుతోందని బుగ్గన కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. Read Also: వైసీపీ దాడులకు భయపడే ప్రసక్తే లేదు: టీడీపీ […]
ఏపీలో ఎయిడెడ్ కళాశాలలు, పాఠశాలల విలీన వ్యవహారం మరోసారి వివాదాస్పదమవుతోంది. ఎయిడెడ్ కాలేజీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళన కార్యక్రమాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఎస్ఎస్‌బీఎన్ కాలేజీ, స్కూల్ విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. దీంతో నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోగా… ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. […]
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత పట్టాభి మరోసారి ఆరోపణలు చేశారు. 20 రోజుల క్రితం వైసీపీ శ్రేణులు పాల్పడిన ఘటనలను ఎవరూ మరిచిపోలేరని.. తాను విదేశాలకు పారిపోయానని వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని తెలిపారు. తన కుటుంబంపై దాడి జరిగిన తర్వాత తన కుటుంబంతో కలిసి తాను బయటకు వెళ్లానని.. అంత మాత్రానికే తన పని అయిపోయిందని, తన గొంతు కూడా వినిపించదంటూ పేటీఎం బ్యాచ్ తెగ సంబరపడిపోతుందని ఎద్దేవా చేశారు. నీతి, నిజాయితీతో […]
కరోనా లాక్‌డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా ప్రజలకు నటుడు సోనూసూద్ సేవలు అందించిన విషయం అందరికీ తెలిసిందే. సోమవారం హైదరాబాద్ నగరంలోని హెచ్‌ఐసీసీలో కోవిడ్ వారియర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించగా… మంత్రి కేటీఆర్, నటుడు సోనూసూద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సోనూసూద్‌కు మద్దతుగా మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తాడనే భయంతోనే అతడిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అందుకే సోనూసూద్ ఇళ్లపై ఐటీ దాడులు, ఈడీ దాడులు చేయించారని […]
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మరోసారి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దాలే మాట్లాడతారని మండిపడ్డారు. ఆదివారం రాత్రి గంటసేపు ప్రెస్‌మీట్ పెట్టి కేసీఆర్ అబద్దాలే మాట్లాడారని.. ఈ అబద్దాలు చెప్పేందుకే ప్లీనరీలు, బహిరంగసభలు, కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో రైతులు సంతోషంగా లేరని.. రైతులను ఆగమాగం చేస్తోంది కేసీఆర్ ప్రభుత్వమేనని విమర్శించారు. తెలంగాణలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగు ఎక్కడ అవుతుందో […]
హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు సమయాల్లో త్వరలో మార్పు చేసుకోనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10:15 గంటల వరకు మెట్రో రైళ్ల సేవలు అందుబాటులో ఉంటున్నాయి. అయితే పలు ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ వచ్చే ప్రయాణికులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఉదయం 7 గంటల కన్నా ముందే మెట్రో స్టేషన్‌లకు చేరుకుని వెయిట్ చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. దయచేసి మెట్రో […]
కేంద్రప్రభుత్వంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్పందించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతోనే సీఎం కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గత ఏడేళ్లుగా కేసీఆర్‌కు ఎప్పుడు కోపం వచ్చినా బీజేపీని తిట్టడం ఆయనకు ఫ్యాషన్ అయిపోయిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడా వరి కొనుగోలు చేయబోమని చెప్పలేదని.. కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే కొనుగోలు చేయం అని చెప్పిందని రఘునందన్‌రావు గుర్తుచేశారు. ఎవరు తప్పు చేసినా […]
ప్రముఖ న్యూస్ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. సోమవారం సాయంత్రం జైలు నుంచి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఓ జ్యోతిష్యుడిని బ్లాక్ మెయిల్ చేసి రూ.30 లక్షలు డిమాండ్ చేశారన్న ఆరోపణలతో తీన్మార్ మల్లన్న ఆగస్టులో అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో క్యూ న్యూస్ కార్యాలయంలో పోలీసులు సోదాలు జరిపి కొన్ని హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. Read Also: శంషాబాద్ లో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత తీన్మార్ మల్లన్నపై ఇప్పటివరకు […]
టాలీవుడ్ హీరోల్లో బాలకృష్ణ మనసు ఎంతో మంచిదని చాలా మంది చెప్తుంటారు. ఆయనకు కోపం ఉన్నా సరే… సేవాగుణంలో మాత్రం ఆణిముత్యం అని పేరు ఉంది. ఇటీవల ‘ఆహా’ ఓటీటీలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే అంటూ ఓ షోను బాలయ్య చేస్తున్నాడు. ఆ షో ఫస్ట్ ఎపిసోడ్‌లో అజీజ్ అనే కుర్రాడి గురించి బాలయ్య ఓ వీడియో చూపించాడు. అజీజ్ తన సోదరి బేగం బ్రెయిన్ క్యాన్సర్ ట్రీట్‌మెంట్ కోసం చదువుమానేసి పనిచేస్తున్నాడని ఆ వీడియో ద్వారా […]
2020 ఏడాదికి సంబంధించి పద్మ అవార్డుల గ్రహీతలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో అట్టహాసంగా ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఏడుగురికి పద్మవిభూషణ్ అవార్డులు, 10 మందికి పద్మభూషణ్ అవార్డులు, 102 మందికి పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. అవార్డులు అందుకున్న వారిలో 29 మంది మహిళలు ఉన్నారు. మరోవైపు 16 మందికి మరణానంతరం పద్మ అవార్డులు ఇస్తుండగా.. ఒక […]