కుర్రకారును విశేషంగా ఆకట్టుకున్న పబ్‌జీ గేమ్‌పై గత ఏడాది కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. భారత్‌లో చైనా పాల్పడుతున్న దుశ్చర్యలను నిరసిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా పలు చైనా యాప్‌లపైనా ఉక్కుపాదం మోపింది. అయితే నిషేధానికి గురైన పబ్‌జీ గేమ్ తిరిగి కొత్త పేరుతో భారత్‌లోకి అడుగుపెట్టింది. ‘పబ్‌జీ న్యూ స్టేట్’ పేరుతో అందుబాటులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా గురువారం విడుదలైన ఈ గేమ్‌ను 17 భాషల్లో డిజైన్ చేశారు. గూగుల్ ప్లేస్టోర్‌లో దీని సైజ్ దాదాపు 1.4 జీబీ ఉంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ వెర్షన్ మాత్రమే రిలీజైంది.
Read Also: మళ్లీ 50వేల మార్క్ దాటిన పసిడి ధర
పబ్‌జీ న్యూ స్టేట్ కూడా బ్యాటిల్ రాయల్ గేమ్. ఈ గేమ్ గతంలో ఉన్న పబ్‌జీ గేమ్‌నే పోలి ఉన్నా ఈసారి అనేక కొత్త మార్పులు వచ్చాయి. గ్రాఫిక్స్ కూడా మరింత మెరుగయ్యాయి. మొబైల్‌లో పబ్‌జీ న్యూ స్టేట్ గేమ్ ఆడాలంటే కనీసం 2జీబీ ర్యామ్ ఉండాలి. అలాగే ఆండ్రాయిడ్ 6.0 కంటే ఎక్కువ ఆపరేటింగ్ సిస్టం ఉండాలి. అంటే దాదాపు ప్రస్తుతం అన్ని ఫోన్లలోనూ పబ్‌జీ న్యూ స్టేట్ గేమ్ రన్ అవుతుంది. అయితే హైఎండ్ మొబైళ్లలో గ్రాఫిక్స్, గేమ్ ప్లే చాలా మెరుగ్గా, స్మూత్ గా ఉంటుంది. పబ్‌జీ న్యూ స్టేట్ గేమ్ 2051 సంవత్సరం ఆధారంగా ఉంటుంది. అలాగే గతంలోని పబ్‌జీ, BGMI తరహాలో 100 మంది ప్లేయర్ల బాటిల్ కాన్సెప్టుతోనే పబ్‌జీ న్యూస్టేట్ గేమ్ ఉంది. కాగా పబ్‌జీని భారత్‌లో నిషేధించిన తర్వాత పబ్జీ మాతృ సంస్థ క్రాప్టన్ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా(BGMI)ను సృష్టించింది.