సూర్యాపేట జిల్లా కోదాడలో విషాదం చోటుచేసుకుంది. టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు కడుతూ కరెంట్ షాక్‌కు గురై ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే… కేంద్రం ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలంటూ శుక్రవారం నాడు తెలంగాణ వ్యాప్తంగా అధికార టీఆర్ఎస్ పార్టీ నిరసనలు, ధర్నాలకు పిలుపునిచ్చింది.
ఈ సందర్భంగా కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ వద్ద టీఆర్ఎస్ ధర్నాకు సంబంధించిన ఫ్లెక్సీ కడుతుండగా బంజారా కాలనీకి చెందిన కందుకూరి సునీల్ (23) అనే యువకుడు కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనలో మరో యువకుడు కుడుముల వెంకటేష్ అనే వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Read Also: రూ.2వేలు కోసం స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తి