దేశవ్యాప్తంగా 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి అత్యధిక విరాళాలు సేకరించిన ప్రాంతీయ పార్టీలలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అగ్రస్థానంలో నిలిచింది. టీఆర్ఎస్ పార్టీకి విరాళాల రూపంలో రూ.89 కోట్లు వచ్చినట్లు ఏడీఆర్ అనే సంస్థ వెల్లడించింది. ఈ జాబితాలో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) రెండో స్థానంలో ఉంది. టీడీపీకి విరాళాల రూపంలో రూ.81 కోట్లు వచ్చాయి. అటు ఏపీలో అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీకి విరాళాల రూపంలో రూ.74 కోట్లు సమకూరినట్లు ఏడీఆర్ తెలిపింది. దేశవ్యాప్తంగా 2019-20లో మొత్తం 25 ప్రాంతీయ పార్టీలకు కలిపి రూ.803.24 కోట్ల విరాళాలు వచ్చినట్లు ఏడీఆర్ పేర్కొంది.
Read Also: కంగనా, కాంగ్రెస్ వార్… కేసు నమోదు
మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ రాజకీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి రూ.445.77 కోట్ల విరాళాలు సమకూరినట్లు ఏడీఆర్ వెల్లడించింది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన విరాళాలలో 95 శాతం ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలోనే వచ్చాయని తెలిపింది. కాగా దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలకు వచ్చిన విరాళాల విషయంలో మొదటి మూడు స్థానాల్లో తెలుగురాష్ట్రాలకు చెందిన పార్టీలో ఉండటం గమనార్హం.