పాకిస్థాన్‌కు మద్దతు ఇచ్చిన సానియా మీర్జా… నెటిజన్‌ల ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పాకిస్థాన్ క్రికెట్ ఆటగాడు షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పాకిస్థాన్ వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సానియా మీర్జా టెన్నిస్‌లో భారత్ తరఫునే ఆడుతోంది. తాజాగా దుబాయ్‌లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సానియా మీర్జా పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వడంపై సోషల్ మీడియాలో ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. గురువారం ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో స్టేడియంలో సానియా మీర్జా కనిపించింది. క్రికెటర్ల కుటుంబసభ్యులకు ప్రత్యేకంగా కేటాయించిన సీట్లలో సానియా మీర్జా కూర్చుని పాకిస్థాన్ జట్టుకు మద్దతు తెలిపింది. ముఖ్యంగా పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మంచి జోష్‌లో కనిపించింది. ఈ మ్యాచ్‌లో సానియా భర్త షోయబ్ మాలిక్ నిరాశపరిచినా పాకిస్థాన్ జట్టు భారీ స్కోరు చేయడంతో వారికి ఛీర్స్ చెప్పింది.
Read Also: తమిళనాడులో భారీ వర్షాలు.. 14 మంది దుర్మరణం
Also Read
అయితే భారత తరఫున టెన్నిస్ ఆడుతూ పాకిస్థాన్ జట్టుకు స్టేడియంలో మద్దతు తెలపడంపై భారత క్రీడాభిమానులు సానియాపై మండిపడుతున్నారు. టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఆడిన మ్యాచ్‌లకు హాజరుకాకుండా పాకిస్థాన్ ఆడే మ్యాచ్‌లకు హాజరై మద్దతు తెలపడాన్ని వారు తీవ్రంగా తప్పుబడుతున్నారు. భారత్ ఉప్పు తిని.. పాకిస్థాన్‌కు సపోర్ట్ చేస్తోందంటూ పలువురు నెటిజన్లు ఆమెపై కామెంట్లు చేస్తున్నారు. ఇకపై సానియా ఆడే టెన్నిస్ టోర్నమెంట్లను బాయ్‌కాట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సానియాకు పాకిస్థాన్ పౌరసత్వాన్ని ఇవ్వాలని.. భారత్ పౌరసత్వాన్ని రద్దు చేయాలని కామెంట్ల ద్వారా కొందరు నెటిజన్లు హితవు పలికారు.

తాజావార్తలు
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!