విశాఖ జిల్లా సింహాచలంలోని వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం రోజు ఓ పాము భక్తులను హడలెత్తించింది. ఆలయ ప్రాంగణంలో పూజా సామాగ్రి దుకాణంలోకి పాము దూరడంతో వెంటనే ఆలయ సిబ్బంది పాములు పట్టుకునే ఆలయ ఉద్యోగి కిరణ్‌కు సమాచారం ఇచ్చారు. అతడు రంగంలోకి దిగి చాకచాక్యంగా పామును పట్టుకుని బంధించడంతో ఆలయ అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. Read Also: వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు… లోకేష్ ఓ ఆరిపోయే దీపం ! గతంలోనూ సింహాచలం […]
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. టెస్టు సిరీస్‌కు ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చారు. వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లీ తొలి టెస్టుకు అందుబాటులో ఉండడని సెలక్టర్లు తెలిపారు. రెండో టెస్టు నుంచి కోహ్లీ అందుబాటులో ఉండనున్నాడు. జట్టు: ఆజింక్యా రహానె (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ […]
హైదరాబాద్ పంజాగుట్టలో మృతి చెందిన చిన్నారి కేసులో మిస్టరీ వీడింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో మహిళతో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కర్ణాటకలో అరెస్ట్ చేసినట్లు వారు వెల్లడించారు. బాలికను సొంత తల్లే హత్య చేసిందని, ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. బాలికను బెంగళూరులో చంపిన కసాయి తల్లి హైదరాబాద్‌కు తీసుకువచ్చి పంజాగుట్టలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. Read Also: […]
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్ రేసులో లేకపోవడానికి కారణం పాకిస్థాన్‌పై ఓటమి. ఈ ఓటమి మన ఆటగాళ్ల మానసిక బలాన్ని దెబ్బతీసింది. దీంతో టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో పాకిస్థాన్-ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత అభిమానులు ఆసీస్‌కు మద్దతు పలికారు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోవాలని కోరుకున్నారు. చివరకు పాకిస్థాన్ ఓడిపోవడంతో భారత అభిమానులు ఆనందానికి హద్దులు లేవనే చెప్పాలి. Read Also: విమానంలో సిగరెట్ తాగిన ఏపీ వ్యక్తి అరెస్ట్ ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు […]
మన దేశంలో బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడం నేరం.. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా విమానంలో సిగరెట్ కాల్చాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు. మన ఏపీకి చెందిన వ్యక్తే. కువైట్ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో 137 మంది ప్రయాణికులు ఉండగా… అందులో ఏపీకి చెందిన మహ్మద్ షరీఫ్ (57) ఉన్నాడు. అతడు భద్రతా సిబ్బంది కళ్లు గప్పి తన లో దుస్తుల్లో దాచుకున్న సిగరెట్లను విమానంలోకి తీసుకువచ్చాడు. Read Also: జపాన్ కు చేరిన […]
ఏపీ సీఎం జగన్ వైద్య పరీక్షల నిమిత్తం శుక్రవారం ఉదయం విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం జగన్ దాదాపు 45 నిమిషాల పాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన తిరిగి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. కాగా సెప్టెంబర్ 24వ తేదీన సీఎం జగన్ వ్యాయామం చేస్తూ గాయపడ్డారు. జిమ్ చేస్తుండగా ఆయన కాలు బెనకడంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆ సమయంలో వైద్యులు సాధారణ ట్రీట్‌మెంట్ ఇవ్వగా […]
కర్ణాటకలో శుక్రవారం తెల్లవారుజామున కన్నూరు-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ధర్మపురం జిల్లా తొప్పూర్-శివడి స్టేషన్‌ల మధ్య కొండచరియలు విరిగిపడి ట్రాక్‌పై పడటంతో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 5 బోగీలు ట్రాక్ పక్కకు ఒరిగిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 2,348 మంది ప్రయాణికులు ఉండగా అందరూ సురక్షితంగా ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. Read Also: దేశంలోనే తొలి స్థానంలో టీఆర్ఎస్, రెండో స్థానంలో టీడీపీ కన్నూరు రైల్వేస్టేషన్ నుంచి గురువారం […]
కరోనా కారణంగా హైదరాబాద్‌లో ఈ ఏడాది నుమాయిష్ నిలిచిపోయింది. అయితే కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో వచ్చే ఏడాది నుమాయిష్‌ను నిర్వహించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరిలో నుమాయిష్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి బి.ప్రభాశంకర్ పేర్కొన్నారు. నుమాయిష్‌కు జీహెచ్ఎంసీ, పోలీసు, ఫైర్ సర్వీసెస్, విద్యుత్, రోడ్ల భవనాల శాఖల నుంచి […]
కామారెడ్డి జిల్లాలో భూమ్‌బాయి అనే వ్యక్తి మృతి చెందగా.. పోలీసులు కొట్టడం వల్లే తన భర్త చనిపోయాడని మహిళ ఆరోపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. రెండు రోజుల క్రితం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శాంతాపూర్ గ్రామంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనలో పేకాట ఆడుతున్న నిందితులను స్టేషన్‌కు తీసుకువెళ్లి పోలీసులు చితకబాదడంతో భూమ్‌బాయికి తీవ్రగాయాలయ్యాయి. ఆయన్ను చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి […]
కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్‌కు అరుదైన గౌరవం దక్కింది. కరోనా లాక్‌డౌన్ సమయంలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ తన నియోజకవర్గంలో ప్రజలకు ఎంతో సేవ చేశారు. కరోనా బాధితులను పరామర్శించడం, వారికి అండగా నిలవడం, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి మాస్కులు, శానిటైజర్లు అందజేయడం లాంటి పనులను చేపట్టారు. ఈ మేరకు ఆయన చేసిన కరోనా సేవలను గుర్తిస్తూ లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఎమ్మెల్యే ఆర్థర్‌ను ‘సర్టిఫికెట్ ఆఫ్ కమిట్‌మెంట్’కు […]