తెలంగాలోని రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మోదీ, కేసీఆర్ ఒక్కటేనని.. ఇద్దరూ కలిసి రైతులను నట్టేట ముంచడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు అసెంబ్లీ రౌడీ సినిమాలోని ఓ సీన్ గురించి రేవంత్ వివరించారు. ఆ సినిమాలో విలన్ మనుషులు రోడ్డు మీదకు వచ్చి తమలో తామే కొట్టుకుంటారని… తమకు టార్గెట్‌గా ఉన్నవారిని చంపేందుకు వాళ్లు అలా చేస్తారని రేవంత్ గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణలో కూడా టీఆర్ఎస్, బీజేపీ […]
అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు నటుడు శివాజీ సంఘీభావం తెలిపారు. అమరావతి రైతులను కలిసి వారికి తన మద్దతును తెలియజేశారు. ఏపీ అంటేనే కులాల కుంపటి అని… ఈ కులాల కుంపట్ల మధ్య రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని శివాజీ ప్రశ్నించారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ఎవరూ గుర్తించడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజలు సినిమాలో సీన్‌లను బాగానే గుర్తుపెట్టుకుంటారని.. కానీ సమాజంలో జరుగుతున్న వాటిని మాత్రం గుర్తుపెట్టుకోవడం లేదన్నారు. ప్రజలందరూ కలుషితం అయిపోయారని.. ఆ […]
ఏపీ అసెంబ్లీలో చంద్రబాబుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం నిర్వహించిన బీఏసీ సమావేశానికి చంద్రబాబు వస్తారని తాము భావించామని.. కానీ ఆయన బీఏసీకి రాలేదని జగన్ తెలిపారు. కొంచెం సేపు బీఏసీ సమావేశాన్ని తాము ఆలస్యం చేశామని.. అయినా చంద్రబాబు రాలేదని.. ఆయనకు ఏం కష్టం వచ్చిందో తనకైతే తెలియదని జగన్ వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబుపై కుప్పం ఎన్నికల ఎఫెక్ట్ పడిందని మా వాళ్లు చెప్తున్నారు’ అంటూ జగన్ ఎద్దేవా చేశారు. Read Also: […]
రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయాలంటూ గురువారం నాడు టీఆర్ఎస్ పార్టీ నేతలు ధర్నాలకు దిగిన విషయం తెలిసిందే. అయితే టీఆర్ఎస్ మహాధర్నా అంశంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ దగ్గర సబ్జెక్ట్ లేదని ఆయన ఆరోపించారు. ఆయన మెంటల్‌గా డిస్ట్రబ్ అయ్యాడని… అందుకే ధర్నాలు, రాస్తారోకోలు, ప్రొటెస్టులు అంటూ ఏదేదో చేస్తున్నాడని రాజాసింగ్ ఎద్దేవా చేశారు. హుజురాబాద్‌లో బీజేపీ దెబ్బకు కేసీఆర్ మైండ్ పనిచేయడం లేదని వ్యాఖ్యానించారు. Read Also: అందుకే […]
ఏపీలో రాజకీయాలకు తావులేకుండా సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని అసెంబ్లీలో సీఎం జగన్ వెల్లడించారు. ఏపీలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని… మొత్తం 1.21 కోట్ల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టామని జగన్ తెలిపారు. రాష్ట్ర జనాభాలో నాలుగింట ఒక వంతు మంది ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని జగన్ స్పష్టం చేశారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన అనుచరులు ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణాలను కోర్టులకు […]
చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా నిత్యం యాక్టివ్ గా వుంటారు. ఒకవైపు ప్రజాప్రతినిధిగా, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా క్షణం ఖాళీ లేకుండా గడుపుతారు. మధ్యలో జబర్దస్త్ లాంటి కామెడీ షోకి జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని కూడా పంచుతుంటారు. తన స్వంత ఊరు నగరిలో పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఒకవైపు రాజకీయ నేతగా బిజీగా ఉన్నా సామాజిక కార్యక్రమాలకు ఆమె టైం కేటాయిస్తూ ఉంటారు. ఆటల్లోనూ పాల్గొంటూ వుంటారు. బుధవారం […]
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గాంధీజీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఎవరైనా ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించాలంటూ గాంధీ చెప్పిన సూత్రాన్ని బుధవారం నాడు కంగనా విమర్శించింది. గాంధీ చెప్పిన సిద్ధాంతంతో మన స్వాతంత్ర్యం పొందామని తనకు ఎవరో చెప్పారని… అలా ఆజాది రాదని.. కంగనా ఓ పోస్ట్ చేసింది. అయితే కంగనా వ్యాఖ్యలపై గాంధీ ముని మనవడు తుషార్ స్పందించారు. Read Also: దుస్తులపై నుంచి […]
లైంగిక వేధింపులపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా బాంబే హైకోర్టు ధర్మాసనంపై అక్షింతలు వేసింది. నిందితుడు బాలిక శరీరానికి నేరుగా తాకనప్పుడు అది పోక్సో చట్టం కిందకు రాదన్న తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలికలను లేదా మహిళలను దుస్తుల పై నుంచి తాకినా లైంగిక వేధింపులుగానే పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోక్సో చట్టానికి బాంబే హైకోర్టు వక్రభాష్యం చెప్పేలా తీర్పు ఇవ్వడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. […]
రోహిత్-ద్రవిడ్ శకం విజయంతో ప్రారంభమైంది. జైపూర్ వేదికగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 165 పరుగుల లక్ష్య ఛేదనను రోహిత్, రాహుల్ జోడీ దూకుడుగా ప్రారంభించింది. 50 పరుగుల భాగస్వామ్యం అందించిన తర్వాత రాహుల్ (15) వెనుతిరిగినా… సూర్యకుమార్ యాదవ్ (62) సిక్సులు, ఫోర్లతో ఎడాపెడా బాదేశాడు. కెప్టెన్ రోహిత్ (48) దగ్గర ఔట్ అయ్యాడు. అనంతరం శ్రేయాస్ అయ్యర్ (5), వెంకటేష్ అయ్యర్ (4) విఫలమైనా […]
భక్తిటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమం దిగ్విజయంగా ఆరో రోజుకు చేరింది. కార్తీక మాసాన హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమం వేలాది మంది భక్తుల సమక్షంలో కన్నుల పండువగా జరుగుతోంది. ఆరోరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ బీజేపీ నేత లక్ష్మణ్ హాజరయ్యారు. ఆయనకు వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఈరోజు కార్యక్రమంలో ముందుగా శంఖారావం పూరించిన తర్వాత హైదరాబాద్ రామకృష్ణమఠానికి చెందిన శ్రీశితికంఠానంద స్వామి, రాజమహేంద్రవరం రామకృష్ణమఠానికి చెందిన శ్రీవినిశ్చలానంద స్వామి, […]