ఏపీలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ ఘనవిజయం సాధించింది. ప్రకాశం జిల్లాలోని దర్శి మున్సిపాలిటీని మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల వైసీపీ విజయఢంకా మోగించింది. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన 54 స్థానాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ సందర్భంగా ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. Read Also: వైఎస్ వివేకా కేసులో మరో నిందితుడు అరెస్ట్ ప్రజలు ప్రభుత్వానికి 100కు 97 […]
కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో మరోసారి ప్రమాదకర వైరస్‌లు వెలుగుచూశాయి. కరోనా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకిందని వస్తున్న వార్తల నేపథ్యంలో కొంతమంది శాస్త్రవేత్తలు చైనాలోని జంతువుల మాంసం విక్రయించే మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని పరీక్షలు జరిపారు. ఈ పరిశోధనల్లో ఆస్ట్రేలియా, చైనా, అమెరికా, బెల్జియం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 16 రకాల జాతులకు చెందిన 1725 వన్యప్రాణులపై వారు పరిశోధనలు జరిపారు. అయితే ఈ పరీక్షల్లో వారికి షాకింగ్ విషయాలు తెలిశాయి. ఒకటి కాదు.. రెండు […]
కృష్ణా జిల్లాలోని ఓ ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ సమీపంలోని మల్లపల్లి గ్రామంలోని ఓ ఆలయంలో బుధవారం నాడు ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వాహకులు తలపెట్టారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ మేరకు పండితులు నిర్ణయించిన ముహూర్తం మేరకు శివాలయంలో క్రేన్ సహాయంతో ధ్వజస్తంభన ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న సమయంలో… క్రేన్ నుంచి ధ్వజస్తంభం జారి కింద పడింది. Also Read: వైరల్… హద్దులు […]
కడప జిల్లా మైదుకూరులో వింత ఘటన చోటుచేసుకుంది. తన ప్రియుడు లేకపోతే తాను బతకలేనంటూ ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. దయచేసి తన ప్రియుడితో తనను కలపాలంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళ్తే… నిజామాబాద్ జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కంది సాయికుమార్ దుబాయ్‌లో పనిచేస్తున్నాడు. అతడికి టిక్ టాక్ ద్వారా మస్కట్‌లో పనిచేస్తున్న కడప జిల్లా మైదుకూరుకు చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరూ సెల్‌ఫోన్‌లలో ప్రతిరోజూ గంటల తరబడి మాట్లాడుకునేవారు. […]
కృష్ణా జిల్లాలో కొండపల్లి మున్సిపాలిటీలో ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. మొత్తం 29 వార్డులకు 14 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు, 14 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఒకస్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపు సొంతం చేసుకున్నాడు. దీంతో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతు కోసం అటు వైసీపీ, ఇటు టీడీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. Read Also: దర్శిలో టీడీపీ విజయ […]
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 34,778 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 148 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మరణించారు. తాజా కేసులతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 6,73,722 పాజిటివ్ కేసులు నమోదు కాగా మొత్తం మృతుల సంఖ్య 3,975కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 50 కేసులు వెలుగు చేశాయి. కరీంనగర్ జిల్లాలో 14 కరోనా కేసులు గుర్తించారు. గడిచిన 24 గంటల్లో 151 మంది కరోనా నుంచి కోలుకున్నారు. […]
హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ సగర్వంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. ఈనెల 12న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈనెల 22 వరకు కొనసాగనుంది. కార్తీక మాసంలో కోటి దీపోత్సవం కార్యక్రమం జరుగుతుండటంతో నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసింది. నగరంలోని వివిధ ప్రాంతాలకు 16 ఆర్టీసీ సర్వీసులు ఏర్పాటు చేసినట్లు అధికారులు […]
జీవితంలో 105 ఏళ్లు బతికి ఉండటమే గగనం. అలాంటిది ఆ వయసులో ప్రపంచ రికార్డు సృష్టించడం అంటే మాటలా? సాధారణంగా వందేళ్ల వయసులో కాలు కదపడమే కష్టం. కర్ర సహాయం లేకుండా ఒక్క అడుగు ముందుకు వేస్తే అద్భుతమే. ఇంకా పరుగుపందెంలో పాల్గొనడం అంటే మాములు మాటలు కాదు. అయితే ఓ బామ్మ మాత్రం అద్భుతాన్ని సుసాధ్యం చేసిందనే చెప్పాలి. 105 ఏళ్ల వయసులో పరుగు పందెంలో పాల్గొని ఎవరికీ సాధ్యం కాని రికార్డును తన బుట్టలో […]
టీ20 ప్రపంచకప్ ముగిసింది. అయినా ఈ టోర్నీ గురించే చర్చ నడుస్తోంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి ప్రపంచకప్పును ఎగరేసుకుపోయింది. మ్యాన్ ఆఫ్ సిరీస్‌గా నిర్వాహకులు డేవిడ్ వార్నర్‌ను ఎంపికచేశారు. వార్నర్ ఈ వరల్డ్ కప్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడి 289 పరుగులు చేశాడు. వార్నర్ సగటు 48.16 కాగా, స్ట్రయిక్ రేటు 140కి పైగా ఉంది. అయితే అతడి కంటే పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సగటు, స్ట్రయిక్ […]
భక్తిటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమం నాలుగోరోజుకు చేరింది. కార్తీక మాసాన జరుగుతున్న ఈ కార్యక్రమం కన్నుల పండువగా జరుగుతోంది. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో వేలాదిమంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మికంగా పరవశింపబడ్డారు. ఈరోజు కోటిదీపోత్సవం కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఆమెకు వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. సోమవారం సాయంత్రం తొలుత శ్రీ ప్రకాశనందేంద్ర సరస్వతి స్వామి, శ్రీ అవధూతగిరి మహారాజ్, మహంత్ శ్రీసిద్ధేశ్వరానందగిరి మహారాజ్, బర్దీపూర్, శ్రీలలితా పీఠం శ్రీ స్వరూపానందగిరి […]