చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా నిత్యం యాక్టివ్ గా వుంటారు. ఒకవైపు ప్రజాప్రతినిధిగా, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా క్షణం ఖాళీ లేకుండా గడుపుతారు. మధ్యలో జబర్దస్త్ లాంటి కామెడీ షోకి జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని కూడా పంచుతుంటారు.
తన స్వంత ఊరు నగరిలో పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఒకవైపు రాజకీయ నేతగా బిజీగా ఉన్నా సామాజిక కార్యక్రమాలకు ఆమె టైం కేటాయిస్తూ ఉంటారు. ఆటల్లోనూ పాల్గొంటూ వుంటారు. బుధవారం వైసీపీ ఎమ్మెల్యే రోజా సెల్వమణి పుట్టినరోజు సందర్భంగా ఆమె కుటుంబసభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో 200 కిలోల కేక్ కట్ చేసి అందరి ఆశీర్వాదాలను తీసుకున్నారు.
READ ALSO ఎమ్మెల్యే రోజా కబడ్డీ .. కబడ్డీ
అలాగే రోజా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరి నియోజకవర్గ స్థాయి గ్రామీణ క్రీడలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులతో పాటు ప్రైజ్ మనీ అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే రోజాకు విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేశారు. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని అంతా ఆకాంక్షించారు.
READ ALSO మొన్న కబడ్డీ… నేడు త్రో బాల్ ఆడిన ఎమ్మెల్యే రోజా