దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్ స్పీడ్‌లో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ట్రాయ్ తాజా గణాంకాల ప్రకారం… అక్టోబర్ నెలలో 4జీ సర్వీస్ ప్రొవైడర్లలో సెకనుకు 21.9 మెగాబిట్ డౌన్‌లోడ్ వేగంతో జియో తన అగ్రస్థానాన్ని నిలుపుకుంది. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్ , వోడాఫోన్ ఐడియా నెట్‌వర్క్ నిరంతరం డేటా డౌన్‌లోడ్ వేగం పెరుగుదలను నమోదు చేస్తూనే ఉన్నాయి. తద్వారా జియో నెట్‌వర్క్‌తో అంతరాన్ని తగ్గించుకున్నాయి. 4జీ డేటా డౌన్‌లోడ్ స్పీడ్‌లో స్వల్ప తగ్గుదల […]
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు రావాలన్న టీడీపీ నేత అచ్చెన్నాయుడికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. ‘మమ్మల్ని రాజీనామా చేసి రమ్మంటున్నారు. ఈ ఎన్నికల్లో ఏం పీకారు. దమ్ముంటే టీడీపీలో మిగిలిన 19 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవండి చూద్దాం. 19 మందిలో మీకు సింగిల్ డిజిట్ వస్తే మేం రాజీనామా చేస్తాం’ […]
టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి పదవీ కాలం ముగిసింది. దీంతో అతడి పనితీరుపై మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ విశ్లేషించాడు. రవిశాస్త్రి కోచ్‌గా ఉన్నంతకాలం క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో టీమిండియాకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నాడు. రవిశాస్త్రి-విరాట్ కోహ్లీ కాంబినేషన్‌కు తాను 100కు 90 మార్కులు వేస్తానని కపిల్ అన్నాడు. వారిద్దరూ ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు కాబట్టి 10 మార్కులు కట్ చేసినట్లు వివరించాడు. Read Also: కుంబ్లే స్థానంలో ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ […]
ఏపీలో గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు కాస్త పెరిగాయి. తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం… నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 35,332 శాంపిళ్లను పరీక్షించగా 230 మందికి కరోనా పాజిటివ్ ఉందని నిర్ధారింపబడింది. కరోనాతో మరో ముగ్గురు మరణించారు. చిత్తూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,70,516కి చేరగా.. మొత్తం కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14,421కి చేరింది. గడిచిన 24 గంటల్లో 346 […]
సీనియర్ నటుడు, నిర్మాత మోహన్‌బాబు నివాసంలో విషాదం నెలకొంది. మోహన్‌బాబు సోదరుడు రంగస్వామి నాయుడు గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రంగస్వామి నాయుడు చనిపోయినట్లు తెలుస్తోంది. ఆయన వయసు 63 సంవత్సరాలు. కొంత కాలంగా రంగస్వామినాయుడు అనారోగ్యంతో బాధ పడుతున్నారు. తిరుపతిలో ఉంటూ వ్యవసాయం చేసుకునే ఆయన… మోహన్‌బాబు చేపట్టే పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు అని సన్నిహితులు చెప్తున్నారు. Read Also: వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి చేయాలి: చిరంజీవి […]
హైదరాబాద్ అమీర్ పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన యోధ లైఫ్ లైన్ డయాగ్నస్టిక్ సెంటర్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అవ్వాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తవుతుంది. Read Also: విమాన ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన కేంద్రమంత్రి.. […]
గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయన్న విషయంపై స్పష్టత లేదు. ఆరునెలల విరామం తర్వాత అసెంబ్లీ జరగనుండటంతో పలు కీలక ఆర్డినెన్సులను ఆమోదించాలని సభ ముందుకు ప్రభుత్వం తీసుకురానుంది. ఈ ఏడాది జులై నుంచి ఇప్పటివరకు వివిధ శాఖలకు సంబంధించి ప్రభుత్వం 14 ఆర్డినెన్సులను జారీ చేసింది. ఒకేరోజున 14 ఆర్డినెన్స్‌లను శాసనసభ, శాసన మండలి ఆమోదించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. Read Also: అసెంబ్లీ సమావేశాల్లో […]
విద్యారంగంలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల అమలుపై సీఎం జగన్ బుధవారం నాడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 2021–22 నుంచి 2022–23, 2023–24 వరకూ మూడు విద్యా సంవత్సరాల్లో నూతన విద్యా విధానం మూడు దశలుగా పూర్తిగా అమలు కానున్నట్లు అధికారులు సీఎంకు చెప్పారు. దీనిలో భాగంగా 25,396 ప్రైమరీ పాఠశాలలను యూపీ(అప్పర్ ప్రైమరీ) స్కూళ్లు, హైస్కూళ్లలో విలీనం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో రానున్న విద్యా సంవత్సరంలో టీచర్ల సంఖ్యను […]
ఏపీలో ఏ ఎన్నిక జరిగినా టీడీపీకి పరాభవం మాములు విషయంగా మారిపోయింది. రాజకీయాలు అన్న తర్వాత గెలుపోటములు మాములే. అయితే ఓ ఎన్నికలో పరాభవం ఎదురైతే.. తరువాత జరిగే ఎన్నికల్లో పుంజుకోవాలని ఏ రాజకీయ పార్టీ అయినా భావిస్తుంది. ఈ మేరకు వ్యూహాలకు పదును పెట్టి ప్రత్యర్థిపై పోటీకి సై అంటుంది. కానీ ఏపీలో ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఓటములను సీరియస్‌గా తీసుకున్న దాఖలాలు కనిపించడంలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికలు మొదలు.. ఇప్పటి లోకల్ బాడీ ఎన్నికల […]
కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ సాధించిన గెలుపుపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజు నుంచి అధికార పార్టీ కుప్పంలో ఏం చేసిందో ప్రజలందరూ చూశారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కుప్పంలో గెలిచామని సీఎం, మంత్రులు జబ్బలు చరుచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారని… అది కూడా ఓ గెలుపేనా అంటూ ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లతో గెలిచి సిగ్గు, శరం లేకుండా సంబరాలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయకులైన మహిళలను […]