ఏపీకి ఏకైక రాజధాని అమరావతే: నటుడు శివాజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు నటుడు శివాజీ సంఘీభావం తెలిపారు. అమరావతి రైతులను కలిసి వారికి తన మద్దతును తెలియజేశారు. ఏపీ అంటేనే కులాల కుంపటి అని… ఈ కులాల కుంపట్ల మధ్య రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని శివాజీ ప్రశ్నించారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ఎవరూ గుర్తించడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజలు సినిమాలో సీన్‌లను బాగానే గుర్తుపెట్టుకుంటారని.. కానీ సమాజంలో జరుగుతున్న వాటిని మాత్రం గుర్తుపెట్టుకోవడం లేదన్నారు. ప్రజలందరూ కలుషితం అయిపోయారని.. ఆ కలుషితం నుంచి బయటపడినప్పుడే భవిష్యత్ తరాలకు మంచి జీవితాన్ని ఇవ్వగలుగుతామని హితవు పలికారు.
Read Also: అల్లుడి ప్రేమలో పడిన అత్త.. కూతురు పెళ్లిలోనే అలా చేసి…
Also Read
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
- AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- OTR: పెనుకొండ వైసీపీలో పీక్స్‌కు చేరిన వర్గపోరు
దేశంలో రాజకీయ వ్యవస్థ బాగా భ్రష్టు పట్టిపోయిందని.. అందుకే అంబానీ లాంటి వారే దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని భావిస్తున్నారని శివాజీ వ్యాఖ్యానించారు. అమరావతిని ఏదో చేద్దామనుకుంటే అది భ్రమేనని.. అమరావతిని ఏం చేయలేరని శివాజీ స్పష్టం చేశారు. ఏపీకి ఉన్న ఏకైక రాజధాని అమరావతే అని.. ఎన్నికల్లో ఎంత డబ్బు పంచినా ఓటర్లు తమ ఆత్మసాక్షికే ఓటు వేస్తారని శివాజీ చెప్పారు. కొడాలి నాని, బొత్స సత్యనారాయణ లాంటి వారు ఎన్ని మాటలు మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని… రాజకీయ నాయకులు ఎప్పటికీ శాశ్వతం కాదనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. మన దౌర్భాగ్యం ఏంటంటే… మీడియా కూడా వర్గాలుగా విడిపోయింది అంటూ శివాజీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Movie Ticket Rates Hikes : పెంచిన సినిమా టిక్కెట్ రేట్లపై ఫైర్ అవుతున్న కామన్ ఆడియన్
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!