నాగాలాండ్‌లో తీవ్రవాదులు అనుకుని పౌరులపైకి భద్రతా బలగాలు కాల్పులు జరిపిన ఘటనలో 17 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్రకలకలం రేపుతున్న నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ తగుచర్యలు చేపట్టింది. దీనిపై నివేదిక ఇవ్వాలని భారత సైన్యం కోర్టు ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటు చేసింది. ఈశాన్య రాష్ట్రాలలో పనిచేసే ఓ మేజర్ ఈ విచారణకు సారథ్యం వహిస్తారని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. ఈ ఘటనలో గ్రామస్తుల మృతదేహాలను గుర్తించిన యువకులు… ఆవేశం చెంది […]
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఘనవిజయం సాధించిన టీమిండియా ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంది. 124 రేటింగ్ పాయింట్లతో టీమిండియా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేత న్యూజిలాండ్ జట్టు 121 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా (108), ఇంగ్లండ్ (107), పాకిస్థాన్ (92) టాప్-5లో ఉన్నాయి. Read Also: రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం మరోవైపు […]
టీమిండియాకు సంబంధించి టెస్టుల్లోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే తుదిజట్టులో స్థానం పోగొట్టుకున్న రహానె.. త్వరలో వైస్ కెప్టెన్ పదవిని కూడా కోల్పోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో రహానె వరుస వైఫల్యాలే అతడి కెరీర్‌ను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. కేవలం టెస్టులు మాత్రమే ఆడుతున్న అతడు.. రెండేళ్లుగా పేలవ ఫామ్‌ను కనపరుస్తున్నాడు. గత ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై మెల్‌బోర్న్‌లో జరిగిన టెస్టులో సెంచరీ మినహా అతడు చెప్పుకోదగ్గ విధంగా ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు […]
ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఇదే విషయాన్ని పార్లమెంట్‌లో కేంద్రమంత్రి కూడా ప్రస్తావించారని ఆయన గుర్తుచేశారు. అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ జవాబుదారీతనం గురించే కేంద్రమంత్రి ప్రశ్నించారని చంద్రబాబు తెలిపారు. జగన్ సీఎం అయినంత మాత్రాన జవాబుదారీతనానికి అతీతుడా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి ఒళ్లంతా ఇగోనే అని.. చెప్పినా అర్థం కాదని ఎద్దేవా చేశారు. జగన్ […]
ముంబై టెస్టులో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా అజాజ్ పటేల్ చరిత్రకెక్కాడు. గతంలో ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ 1956లో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియాపై 10కి 10 వికెట్లు సాధించగా.. 1999లో భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పాకిస్థాన్‌పై ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు 22 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ స్పిన్నర్ మళ్లీ ఆ ఘనత సాధించి మూడో […]
సౌతాఫ్రికాకు చెందిన ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా వెళ్లాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ పర్యటనలో భారత్ మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడుతుందని బీసీసీఐ కార్యదర్శి జై షా శనివారం నాడు మీడియాకు వెల్లడించారు. అయితే షెడ్యూల్ ప్రకారం ఆడాల్సిన మూడు టీ20ల సిరీస్‌ను వాయిదా వేస్తున్నామని… ఆ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామని ఆయన తెలిపారు. Read Also: ముంబై టెస్టులో విరాట్ కోహ్లీ […]
ఏపీలో కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చడం, నిధుల గోల్‌మాల్ అంశాలపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర పథకాల పేర్లను జగన్ సర్కారు తమకు ఇష్టం వచ్చినట్లు మార్చడం సరికాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంలో జగన్ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కేంద్రం ప్రవేశపెట్టిన పోషణ్ అభియాన్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్స్, ఇంటిగ్రేటెడ్ ఛైల్మ్ డెవలప్‌మెంట్ స్కీమ్స్ పేర్లను పథకాలకు జగనన్న గోరుముద్ద, జగనన్న పాలవెల్లువ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణగా […]
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోశయ్య కుమారుడు శివకు ఫోన్ చేసి రాహుల్ గాంధీ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. రోశయ్య ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబీకులు ధైర్యంగా ఉండాలని రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. అనంతరం కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావుకు కూడా రాహుల్ గాంధీ ఫోన్ చేసి రోశయ్య మరణంపై వివరాలను తెలుసుకున్నారు. Read Also: […]
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా రెండో రోజు లంచ్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. 221/4 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు బ్యాటింగ్ ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మరో నాలుగు పరుగులు జోడించిన వెంటనే టీమిండియా సాహా (27) వికెట్‌ను కోల్పోయింది. ఈ వికెట్ కూడా అజాజ్ పటేల్ ఖాతాలోకే వెళ్లింది. అయితే వెంటనే అదే ఓవర్‌లో భారత్‌కు మరో షాక్ తగిలింది. ఆల్‌రౌండర్ […]
సినిమాల్లో మాటల మాంత్రికుడు అనగానే అందరికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు ఎలా గుర్తుకువస్తుందో.. రాజకీయాల్లో మాటల మాంత్రికుడు అంటే రోశయ్య పేరు గుర్తుకురాక మానదు. ఎందుకంటే ఆయన చెప్పే సింగిల్ డైలాగ్‌లో ఎన్నో సమాధానాలు ఉంటాయి. ఆయన మాటలు పరుషంగా లేకపోయినా చాలా అర్థవంతంగా ఉంటాయి. ఎవరైనా రోశయ్యపై ఆరోపణలు చేస్తే.. రోశయ్య సింగిల్ డైలాగుతో సమాధానం చెప్పేస్తారు. దీంతో బడా రాజకీయ నేతలు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితులు గతంలో ఎన్నో చోటుచేసుకున్నాయి. అందుకే ఉమ్మడి […]