వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుమార్తె కులాంతర వివాహం చేసుకుంటే తమ పరువు పోతుందని భావించిన తల్లి ఏకంగా తన కుమార్తెను కడతేర్చింది. వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మీ తెలిపిన వివరాల మేరకు… పర్వతగిరికి చెందిన ఉబ్బని సమ్మక్కకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తెకు వివాహం జరిపించిన అనంతరం ఆమె భర్త చనిపోయాడు. దీంతో సమ్మక్క కూరగాయలు విక్రయిస్తూ బతుకుబండి నెట్టుకువస్తోంది. Read Also: తూ.గో. జిల్లాలో యువకుడి దారుణహత్య… శవాన్ని ముక్కలు చేసి… ఈ నేపథ్యంలో […]
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం కోలమూరులో యువకుడి హత్య సంచలనం రేపుతోంది. గత నెల 24న నాగసాయి అలియాస్ వెంకటేష్ (25) అనే యువకుడిని నలుగురు నిందితులు హత్య చేశారు. వెంకటేష్ మృతదేహాన్ని నిందితులు ముక్కలు చేసి రోజుకొక భాగం చొప్పున దహనం చేస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తమకు దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. Read Also: కన్న బిడ్డకు కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేసిన […]
దేశవ్యాప్తంగా అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అన్నదాతల అప్పులకు రాజకీయంగా, ఆర్థికపరంగా చాలా కారణాలు ఉన్నాయి. అయితే అప్పుల్లో కూరుకుపోయిన వ్యవసాయ కుటుంబాల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు దేశంలోనే టాప్‌లో ఉన్నాయి. ఏపీలో 93.2 శాతం మంది రైతులు, తెలంగాణలో 91.7 మంది రైతుల కుటుంబాలపై రుణ భారం ఉన్నట్టు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ జాబితాలో కేరళ(69.9%), కర్ణాటక(67.7%), తమిళనాడు (65.1%), ఒడిశా (61.2%), మహారాష్ట్ర (54శాతం) రాష్ట్రాలు వరుస స్థానాల్లో […]
కొణిజేటి రోశయ్య కాంగ్రెస్ పార్టీలో అత్యంత నమ్మదగిన నాయకుడు. రోశయ్య దివంగత నేత వైఎస్ఆర్‌కు ఆప్తుడిగా మెలిగేవారు. గుంటూరు జిల్లా నిడుబ్రోలులో రాజకీయ పాఠాలు నేర్చుకున్న ఆయన.. గుంటూరు నగరంలోని హిందూ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1968, 1974, 1980, 2009లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1989, 2004లో చీరాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1998లో నర్సరావుపేట నుంచి లోక్‌సభ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆర్యవైశ్య కులం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నేతగా రోశయ్యకు మంచి పేరు […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య (88) అనారోగ్యంతో శనివారం ఉదయం కన్నుమూశారు. ఒక్కసారిగా ఆయనకు బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గం మధ్యలో రోశయ్య చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రోశయ్య గతంలో తమిళనాడు గవర్నర్‌గా పని చేశారు. అయితే కొన్నాళ్లుగా రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత సెప్టెంబర్ 3, 2009 నుంచి జూన్ 25, 2011 […]
నేడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాదికి ఇదే చివరి సూర్యగ్రహణం. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10:59 గంటలకు గ్రహణం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3:07 గంటలకు ముగుస్తుంది. నాలుగు గంటలకు పైగా సాగే ఈ గ్రహణం భారత్‌లో ఉన్న ప్రజలకు కనిపించదని నిపుణులు వెల్లడించారు. మన దేశంలో ఏ ప్రాంతంలో కూడా గ్రహణం కనపడదని వారు పేర్కొన్నారు. దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాల్లోని అన్ని ప్రాంతాల్లో గ్రహణం కనపడుతుంది. అయితే మనకు గ్రహణం […]
హైదరాబాద్ నగరంలోని పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్డుపై శనివారం ఉదయం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని శంషాబాద్ నుంచి ఘట్‌కేసర్ వైపు వెళ్తున్న ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అటుగా వెళ్తున్న ఓ వాహనదారుడు కారులో మంటలను చూసి డ్రైవర్‌ను బయటకు లాగడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్‌కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఈసీఐఎల్‌కు దమ్మాయిగూడకు చెందిన మయూర్‌గా పోలీసులు గుర్తించారు. […]
ప్రతిరోజూ నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే శరీరం ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఫిట్‌గా ఉంటుంది. అయితే రోజుకు కనీసం అరగంట చొప్పున వారానికి 150 నిమిషాల పాటు ఒక మాదిరి నుంచి కాస్త తీవ్రమైన వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఏదో పేరుకి చేశామంటే.. చేశామా అని కాకుండా శరీరానికి చమట పట్టేంతవరకు వ్యాయామం చేస్తేనే ఉపయోగం ఉంటుంది. అయితే అతిగా, విపరీతంగా ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాయామం […]
తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోదీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన నీటిపారుదల ప్రాజెక్టు కాళేశ్వరం, మరో ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలలో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని తన ట్వీట్‌లో కేటీఆర్ పేర్కొన్నారు. ఏపీలోని పోలవరం, కర్ణాటకలోని ఎగువ భద్ర ప్రాజెక్టులకు ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా ఇవ్వాలని కేటీఆర్ కోరారు. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని ఇప్పటికే […]