రష్యా అధినేత పుతిన్ భారత పర్యటనలో కీలక ఒప్పందాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో ప్రధాని మోదీ-పుతిన్ కీలక ఒప్పందాలపై చర్చలు జరిపారు. రక్షణ, వాణిజ్య, ఇంధనం, పెట్టుబడులు, టెక్నాలజీ రంగాలకు సంబంధించి కీలక ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. నౌకాయానం, అనుసంధాన రంగాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న S-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ డెలివరీపై మోదీ-పుతిన్ మధ్య చర్చలు జరిగాయి. కాగా గడిచిన మూడు దశాబ్దాలుగా భారత్-రష్యా మధ్య […]
యూట్యూబ్‌లో T-సిరీస్ ఛానల్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. T-సిరీస్ ఛానల్ సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య 200 మిలియన్లకు చేరుకుంది. దీంతో ఈ మైలురాయి దాటిన మొదటి యూట్యూబ్ ఛానెల్‌గా అవతరించింది. ప్రపంచంలో మరే ఇతర ఛానల్ ఈ ఫీట్ సాధించలేదు. భూషణ్ కుమార్‌కు చెందిన T-సిరీస్ భారతదేశంలోనే అతి పెద్ద మ్యూజిక్ కంపెనీగా కొనసాగుతోంది. T-సిరీస్ పేరుతో బాలీవుడ్‌లో పలు సినిమాలు కూడా నిర్మితం అవుతున్నాయి. Read Also: మరోసారి చిక్కుల్లో విజయ్ సేతుపతి కాగా ఈ […]
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్‌లకు గడువు ముగిసింది. ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్‌లు రికార్డు స్థాయిలో దాఖలయ్యాయి. గత 5 ఏళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది అధికంగా అడ్మిషన్‌లు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. ఇంటర్ ఫస్టియర్‌లో మొత్తం లక్షా 55 వేల 408 సీట్లు ఉంటే లక్షా 10 వేల 686 సీట్లు భర్తీ అయ్యాయన్నారు. లక్ష దాటడం కూడా ఇదే మొదటి సారి అని వెల్లడించారు. Read Also: హైదరాబాద్‌లో […]
ఏపీకి పోలవరం ప్రాజెక్టు అతి ముఖ్యమైనది అని అందరికీ తెలిసిన విషయమే. గత కొన్నేళ్లుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావడం లేదు. దీంతో నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోంది. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సోమవారం నాడు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యమని తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్టు పూర్తిపై రాజ్యసభలో టీడీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయమంత్రి బిశ్వేశ్వర తుడు లిఖితపూర్వకంగా సమాధానం […]
పీఆర్సీ విషయంలో తమ డిమాండ్లు నెరవేర్చాని కోరుతూ మంగళవారం నుంచి ఏపీలో ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగనున్నాయి. అయితే ఉద్యోగ సంఘాలు చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ నిర్ణయించుకుంది. ఈ మేరకు తాము సమ్మెలో పాల్గొనడం లేదని ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.రవికుమార్ ప్రకటించారు.. రేపటి నుంచి ఉమ్మడి జేఏసీ తలపెట్టిన నిరసన కార్యక్రమాల్లో ఏపీ ట్రెజరీ ఉద్యోగుల సంఘం పాల్గొనటం లేదని స్పష్టం చేశారు. పది […]
విశాఖలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రకాష్ నగర్‌లో రౌడీ షీటర్ దోమాన చిన్నారావును స్థానిక మహిళలు చితకబాదారు. స్కూల్‌కు వెళ్లే అమ్మాయిలకు పెన్నులు, పెన్సిళ్లు ఇస్తూ చిన్నారావు వారికి ఆశ చూపించాడు. దీంతో కొందరు విద్యార్థినులు చిన్నారావు మాటలు నమ్మి అతడి దగ్గరకు వెళ్లారు. కానీ ఇదే అదనుగా భావించిన చిన్నారావు అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో స్థానిక మహిళలందరూ కలిసి […]
ప్రముఖ నటుడు, హెల్పింగ్ స్టార్ సోనూసూద్‌కు మరో షాక్ తగిలింది. గెస్ట్ హౌస్ కోసం నిర్మించిన ఆరు అంతస్తుల భవనంలో సోనూసూద్ హోటల్ నడుపుతున్నారని… కోర్టు ఆదేశాల ప్రకారం సదరు హోటల్‌ను నివాస భవంతి మార్చుతానని మాట ఇచ్చిన ఆయన ఇంకా నిలబెట్టుకోలేదని ముంబై బృహన్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ విషయంపై సోనూసూద్ వెంటనే స్పందించాలని నోటీసుల్లో బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు గుర్తుచేశారు. Read Also: హైదరాబాద్‌లో తాగుబోతుల వీరంగం.. ఒకేరోజు […]
హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. పోలీసులు ఎంత నిఘా వేసినా వాళ్ల కళ్లుగప్పి పలువురు వ్యక్తులు ఫుల్లుగా మద్యం తాగి వాహనాలను డ్రైవింగ్ చేస్తున్నారు. సోమవారం ఒకేరోజు పలువురు వ్యక్తులు తప్పతాగి వాహనాలు నడపటంతో మూడు రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యారు. బంజారాహిల్స్, నార్సింగి, ఎస్.ఆర్.నగర్‌లో ఈ రోడ్డుప్రమాదాలు చోటుచేసుకున్నాయి. Read Also: పాములను తరిమేసేందుకు పొగ పెట్టాడు… ఇంటికి నిప్పంటుకోవడంతో… నార్సింగి వద్ద సంజీవ్ అనే వ్యక్తి మద్యం మత్తులో కారుతో […]
నాగాలాండ్‌లో భద్రతా బలగాలు సాధారణ పౌరులపై కాల్పులు జరిపిన ఘటన దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. ఈ ఘటన తీవ్రకలకలం రేపుతున్న నేపథ్యంలో రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఉగ్రవాదులనే అనుమానంతోనే భద్రతా బలగాలు ఈ కాల్పులు జరిపారని అమిత్ షా స్పష్టం చేశారు. ఆత్మరక్షణ కోసమే సైనికులు ఈ కాల్పులు జరిపారని అమిత్ షా తెలిపారు. నాగాలాండ్‌లో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. Read Also: వైరల్ వీడియో: చిన్నారి ప్రాణాన్ని […]
తల్లిదండ్రులు తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కానీ నిర్లక్ష్యం చేస్తే పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే ఓ తల్లిదండ్రులు చేసిన నిర్లక్ష్యం ఏకంగా బిడ్డ ప్రాణాన్నే బలిగొంది. వివరాల్లోకి వెళ్తే.. షాపింగ్ చేద్దామని తల్లిదండ్రులు తమ చిన్నారితో కలిసి బైకు మీద బయటకు వచ్చారు. అయితే చిన్నారిని బైక్ నుంచి కిందకు దింపకుండా బండి మీదే కూర్చోబెట్టి తల్లిదండ్రులు రోడ్డుపై షాపింగ్ చేస్తున్నారు. బైక్ మీద కూర్చున్న చిన్నారి ఆడుకుంటూ ఉండగా… బైకు అదుపు […]