ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఘనవిజయం సాధించిన టీమిండియా ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంది. 124 రేటింగ్ పాయింట్లతో టీమిండియా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేత న్యూజిలాండ్ జట్టు 121 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా (108), ఇంగ్లండ్ (107), పాకిస్థాన్ (92) టాప్-5లో ఉన్నాయి.
Read Also: రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం
మరోవైపు ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ (2021-23) పాయింట్ల పట్టికలో భారత్ మూడో స్థానంలోనే కొనసాగుతోంది. మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా మూడు విజయాలు, రెండు డ్రాలు, ఓ ఓటమితో 42 పాయింట్లు సాధించి టాప్‌లో ఉన్నా.. విజయాల శాతం ఆధారంగా 58.33 పర్సంటేజీతో మూడో స్థానంలో నిలిచింది. శ్రీలంక 100 శాతం పర్సంటేజీతో అగ్రస్థానంలో ఉండగా… పాకిస్థాన్ 66.66 శాతం విన్నింగ్ పర్సంటేజీతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఇంకా పాయింట్ల ఖాతాను ఓపెన్ చేయలేదు.
