రహానెపై వేటు.. వైస్ కెప్టెన్ పదవి కూడా అతడికే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియాకు సంబంధించి టెస్టుల్లోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే తుదిజట్టులో స్థానం పోగొట్టుకున్న రహానె.. త్వరలో వైస్ కెప్టెన్ పదవిని కూడా కోల్పోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో రహానె వరుస వైఫల్యాలే అతడి కెరీర్‌ను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. కేవలం టెస్టులు మాత్రమే ఆడుతున్న అతడు.. రెండేళ్లుగా పేలవ ఫామ్‌ను కనపరుస్తున్నాడు. గత ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై మెల్‌బోర్న్‌లో జరిగిన టెస్టులో సెంచరీ మినహా అతడు చెప్పుకోదగ్గ విధంగా ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ అతడు విఫలమయ్యాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 35 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులు మాత్రమే చేయడంతో రెండో టెస్టుకు జట్టులో స్థానం కోల్పోయాడు.
Read Also: అజాజ్ పటేల్ ప్రపంచ రికార్డు… 10కి 10 వికెట్లు తీసిన కివీస్ స్పిన్నర్
Also Read
- Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
- Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
- India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
- Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్‌గా రహానెను తప్పించి ఆ స్థానంలో రోహిత్ శర్మను నియమించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన మరో వారం రోజుల్లో వెలువడనుందని సమాచారం. ఇప్పటికే రోహిత్ శర్మ టీ20 మ్యాచ్‌లకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. త్వరలో టెస్టులకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అందుకోనున్నాడు. త్వరలో దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. ఈ పర్యటనలోనే రోహిత్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి.
తాజావార్తలు
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..