రాజకీయాల్లో మాటల మాంత్రికుడు రోశయ్య… సింగిల్ డైలాగ్‌తో నోళ్లు మూయించేవారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమాల్లో మాటల మాంత్రికుడు అనగానే అందరికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు ఎలా గుర్తుకువస్తుందో.. రాజకీయాల్లో మాటల మాంత్రికుడు అంటే రోశయ్య పేరు గుర్తుకురాక మానదు. ఎందుకంటే ఆయన చెప్పే సింగిల్ డైలాగ్‌లో ఎన్నో సమాధానాలు ఉంటాయి. ఆయన మాటలు పరుషంగా లేకపోయినా చాలా అర్థవంతంగా ఉంటాయి. ఎవరైనా రోశయ్యపై ఆరోపణలు చేస్తే.. రోశయ్య సింగిల్ డైలాగుతో సమాధానం చెప్పేస్తారు. దీంతో బడా రాజకీయ నేతలు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితులు గతంలో ఎన్నో చోటుచేసుకున్నాయి. అందుకే ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు సీఎం అయినా మంత్రిగా రోశయ్య ఉండాల్సిందే.
Read Also: అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోశయ్య
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు… అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి రోశయ్యను ఉద్దేశించి మీకు ఈ మధ్య తెలివితేటలు ఎక్కువ అయ్యాయి అంటూ వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు విమర్శకు ప్రతిస్పందించిన రోశయ్య… తనకే తెలివితేటలు ఉంటే చెన్నారెడ్డిని, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డిని, అంజయ్యను, వీరితో పాటు తనను నమ్మిన వైఎస్‌ఆర్‌ను దించి ఎప్పుడో సీఎం అయ్యే వాడిని అంటూ సెటైర్ వేశారు. ఇందులో చాలా అర్ధాలను మనం విశ్లేషించవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్‌ను సీఎం సీటులో నుంచి దించి చంద్రబాబు సీఎం అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని పరోక్షంగా అసెంబ్లీలో రోశయ్య తన డైలాగ్ ద్వారా ప్రస్తావించారు. అంతేకాదు రోశయ్య సీఎంగా ఉన్న సందర్భంలోనూ ప్రతిపక్షాలు… ‘మీరు మందబలంతో బిల్లులు పాస్ చేయించుకుంటున్నారు’ అని ఆరోపణలు చేయగా… రోశయ్య ‘అవును.. మాకు మందబలం ఉంది కాబట్టే అధికారంలో ఉన్నాం’ అంటూ సింగిల్ పంచ్‌తో ప్రతిపక్షాల నోళ్లు మూయించారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!