నాగాలాండ్‌లో తీవ్రవాదులు అనుకుని పౌరులపైకి భద్రతా బలగాలు కాల్పులు జరిపిన ఘటనలో 17 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్రకలకలం రేపుతున్న నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ తగుచర్యలు చేపట్టింది. దీనిపై నివేదిక ఇవ్వాలని భారత సైన్యం కోర్టు ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటు చేసింది. ఈశాన్య రాష్ట్రాలలో పనిచేసే ఓ మేజర్ ఈ విచారణకు సారథ్యం వహిస్తారని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. ఈ ఘటనలో గ్రామస్తుల మృతదేహాలను గుర్తించిన యువకులు… ఆవేశం చెంది రెండు మిలటరీ వ్యాన్‌లకు నిప్పు పెట్టడంతో ఓ ఆర్మీ జవాన్ కూడా చనిపోయాడు.
Read Also: నాకొద్దు బాబోయ్ వ్యాక్సిన్.. వీడియో వైరల్
కాగా నాగాలాండ్ ఘటనలో మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ.11 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని వెల్లడించింది. ఈ దుర్ఘటనపై హోంమంత్రి అమిత్‌షాతో తాను మాట్లాడానని.. కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని నాగాలాండ్ సీఎం నేఫియూ రియో తెలిపారు. రాష్ట్రం నుంచి సాయుధ బలగాల చట్టాన్ని కూడా ఉపసంహరించాలని కూడా కేంద్రాన్ని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ చట్టం దేశ ప్రతిష్టను మసకబారుస్తోందని నాగాలాండ్ సీఎం ఆరోపించారు.