బంగాళాఖాతంలో జవాద్ తుఫాన్ మరింత బలపడి తీవ్ర తుఫాన్‌గా మారనుంది. ఈ తుఫాన్ ఉత్తరాంధ్ర తీరం వద్దకు దూసుకువస్తోంది. ఉత్తర దిశగా కదులుతూ ఆదివారం మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుఫాన్ తీరం దాటిన తర్వాత బంగాళాఖాతం వైపు వెళ్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో రానున్న మూడు రోజులు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 80-100 కి.మీ. వేగంతో కూడిన ఈదురుగాలులతో కూడిన […]
✍ జవాద్ తుఫాన్ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూ.గో. జిల్లాలో నేడు స్కూళ్లకు సెలవు✍ హైదరాబాద్‌లో నేడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన… ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ సదస్సులో పాల్గొననున్న సీజేఐ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్✍ నేడు విజయవాడలో బీజేపీ కార్యవర్గ సమావేశం.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్న బీజేపీ నేతలు✍ 34వ రోజుకు చేరిన అమరావతి రాజధాని రైతుల మహాపాదయాత్ర… నేడు నెల్లూరు జిల్లా సైదాపురం నుంచి ప్రారంభం.. […]
ఏపీ రాజకీయాల్లో కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినపడుతోంది. ఇటీవల చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు తీవ్రంగా ఆరోపించగా… నందమూరి కుటుంబసభ్యులు కూడా ఈ అంశంపై స్పందించారు. అయితే హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందన తమకు నచ్చలేదని కొందరు టీడీపీ సీనియర్ నేతలు బాహాటంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్టీఆర్ అభిమానులు నిరసన వ్యక్తం చేసిన విషయం సోషల్ […]
సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కుక్కలు, పిల్లులు హల్‌చల్ చేస్తుంటాయి. కానీ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. చౌబేపూర్‌లోని ప్రభుత్వ కార్యాలయంలోకి మేక ప్రవేశించి మెల్లగా క్యాంటీన్ పక్కన ఉన్న గదికి చేరుకుంది. గదిలో ఉన్న ప్రభుత్వ ఫైల్‌ను నోటితో పట్టుకుంది. అనంతరం కార్యాలయం బయటకు పరుగెత్తుకు వెళ్లింది. అయితే మేక నోటి వెంట ఫైల్‌ను చూసిన ఓ ఉద్యోగి దాని వెనుక పరిగెత్తాడు. దీంతో అది కీలకమైన డాక్యుమెంట్ ఫైల్ అని భావించిన ప్రభుత్వ ఉద్యోగులకు […]
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం కూడా లోక్‌సభ, రాజ్యసభల్లో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ప్రకటన చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. లోక్‌సభలో ప్లకార్డులను ముక్కలు ముక్కలుగా చింపి విసిరేసి నిరసన తెలియజేశారు. వరి కొనుగోళ్లపై టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కేంద్రాన్ని నిలదీశారు. ఐదు రోజులుగా తెలంగాణ రైతుల గురించి తాము ఆందోళన చేస్తున్నామని, తెలంగాణలో వరి ధాన్యం కొంటారా? కొనరా? అనే విషయంపై కేంద్ర […]
హైదరాబాద్ నగరంలో శుక్రవారం నాడు కొత్తగా 32 బస్తీ దవాఖానాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని ప్రతి 5 వేల నుంచి 10 వేల వరకు జనాభాకు ఒక బస్తీ దవాఖానాను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో బాలానగర్‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను మంత్రి హరీష్‌రావు, షేక్‌పేటలో బస్తీ దవాఖానాను మంత్రి కేటీఆర్.. దూల్‌పేటలో బస్తీ దవాఖానాను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ… హైదరాబాద్ నగరంలో ప్రజల వద్దకే […]
ఏపీ ప్రజలను మరో తుఫాన్ హడలెత్తిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్ మారి ఏపీ వైపు దూసుకొస్తోంది. విశాఖకు 670 కి.మీ దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ దిశగా కదులుతోంది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలలో క్రమంగా వాతావరణం మారుతోంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాలలో అలజడి మొదలైంది. ఈదురుగాలుల తాకిడి కూడా పెరుగుతోంది. గంటకు 45 నుంచి 50 కి.మీ. మేర వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. శనివారం ఉదయానికి ఉత్తర కోస్తా, […]
దేశంలో గత ఏడాది కాలంగా డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయని ప్రధాని మోదీ వెల్లడించారు. శుక్రవారం ఉదయం ఫిన్‌టెక్ ఇన్ఫినిటీ ఫోరంలో మాట్లాడిన ఆయన… గత ఏడాది కాలంలో మొబైల్ చెల్లింపులు మొదటిసారిగా ఏటీఎం నగదు ఉపసంహరణలను మించిపోయాయని ట్విట్టర్ ద్వారా తెలిపారు. గత ఏడాది కాలంలో సుమారు 6.90 కోట్ల రూపే కార్డులను వినియోగదారులు తీసుకున్నారని… వాటి ద్వారా సుమారు 130 కోట్ల లావాదేవీలు జరిగాయని వివరించారు. Read Also: 2022: కొత్త ఏడాదిలో భారీగా […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్‌స్టార్ మహేష్‌బాబు కలిసి మరోసారి ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారు. గతంలో భరత్ అనే నేను ప్రీరిలీజ్ ఈవెంట్ ద్వారా అభిమానులను వీరు అలరించారు. తాజాగా జెమినీటీవీలో ప్రసారమవుతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో వీరిద్దరూ కలిసి సందడి చేయనున్నారు. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో మహేష్‌బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎపిసోడ్ అతి త్వరలోనే ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ ఈనెల 5న ఆదివారం రాత్రి 8:30 గంటలకు టెలీకాస్ట్ చేయనున్నట్లు […]
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లింది ఎందుకంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ ఫోటోను షేర్ చేశారు. ‘ముఖ్యమంత్రి గారూ… మీరు వెళ్లింది మీ ఇసుక మాఫియాల కోసం జలసమాధి అయిపోయిన 60 మంది కుటుంబసభ్యులను పరామర్శించడానికి. మీ వంధిమాగదులతో సెల్ఫీలు తీసుకోవడానికి కాదు’ అని లోకేష్ ఆరోపించారు. ‘మీరు వెళ్లింది.. […]